భారతదేశంలో కరోనా డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయి. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి.
తాజాగా 2020, మార్చి 24వ తేదీ మంగళవారం మహారాష్ట్రలో 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఇతను ఇటీవలే యూఏఈ నుంచి వచ్చాడు. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 11కి చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్ ఉంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి జాతినుద్దేశించి..మంగళవారం రాత్రి 8 గంటలకు మాట్లాడనున్నారు. ఆయన కీలక నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
* మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరుకున్నాయి.
* జనతా కర్ఫ్యూను పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
* మహారాష్ట్రలో 105 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
* కేరళ రాష్ట్రంలో 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
* తెలంగాణ, ఢిల్లీ, బీహార్ 30కి పైగా కేసులు రికార్డవుతున్నాయి.
* గుజరాత్ రాష్ట్రంలో 36 కేసులు నమోదయ్యాయి.
* మలేషియా నుంచి 113 మంది భారతీయులు చెన్నైకి చేరుకున్నారు.
* కరోనా లక్షణాలున్న 9 మందిని ఆసుపత్రికి తరలింపు.
* మరో 104 మందిని క్వారంటైన్ సెంటర్ కు తరిలింపు.
* కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు.
* అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని హెచ్చరికలు.