భారత దేశంలో కరోనా సోకిన గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. రెండు రోజుల పాటు మరణించిన కేసులో భారత్ అమెరికాను దాటిపోయింది. గత 24 గంటల్లో దేశంలో 587 మంది చనిపోగా, అమెరికాలో 537 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,191కు చేరుకుంది. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 587 మంది చనిపోయారు.
కోవిడ్-19తో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 28,084 మంది మరణించినట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక 7,24,578 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 4,02,529 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కోవిడ్-19 పరీక్షలను ముమ్మరంగా చేపడుతున్నామని 3,30,000కు పైగా శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ పేర్కొంది.
జులై 20 వరకూ దేశవ్యాప్తంగా 1,43,81,303 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇక ఎన్-95 మాస్క్‌ల వాడకంపై ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. వాల్వ్ రెస్పిరేటరీలతో కూడిన ఎన్-95 మాస్క్‌లను సరిగ్గా వాడకుంటే కరోనా వైరస్ సంక్రమణను అడ్డుకోలేరని స్పష్టం చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కంటైన్మెంట్ విధానాలకు విరుద్ధం అని ప్రకటించింది.
ఇక కరోనా సోకిన వారి సంఖ్యలో భారతదేశం బ్రెజిల్‌ను దాటేసింది. భారతదేశంలో మునుపటి రోజు 37 వేల 148 కొత్త కేసులు నమోదయ్యాయి, బ్రెజిల్లో కొత్తగా 21,749 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. 10 లక్షల జనాభాకు సోకిన కేసులు, మరణాల గురించి మాట్లాడితే, ఇతర దేశాల కంటే భారతదేశం మెరుగ్గా ఉంది.
భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (3,961,206), బ్రెజిల్ (2,121,645) లో ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.
రాష్ట్రాలవారీగా గణాంకాలు:
క్రమ సంఖ్య | రాష్ట్రం పేరు | మొత్తం కరోనా కేసులు |
కోలుకున్నవారు | మరణాలు |
---|---|---|---|---|
1 | అండమాన్ నికోబార్ | 207 | 152 | 0 |
2 | ఆంధ్రప్రదేశ్ | 53724 | 24228 | 696 |
3 | అరుణాచల్ ప్రదేశ్ | 790 | 285 | 3 |
4 | అస్సాం | 25382 | 17095 | 58 |
5 | బీహార్ | 27646 | 17433 | 217 |
6 | చండీగఢ్ | 737 | 518 | 12 |
7 | ఛత్తీస్గఢ్ | 5561 | 3944 | 25 |
8 | ఢిల్లీ | 123747 | 104918 | 3663 |
9 | గోవా | 3853 | 2361 | 23 |
10 | గుజరాత్ | 49353 | 35678 | 2162 |
11 | హర్యానా | 26858 | 20226 | 355 |
12 | హిమాచల్ ప్రదేశ్ | 1631 | 1067 | 11 |
13 | జమ్మూ కాశ్మీర్ | 14650 | 8274 | 254 |
14 | జార్ఖండ్ | 5756 | 2810 | 53 |
15 | కర్ణాటక | 67420 | 23795 | 1403 |
16 | కేరళ | 13274 | 5616 | 43 |
17 | లడఖ్ | 1195 | 1007 | 2 |
18 | మధ్యప్రదేశ్ | 23310 | 15684 | 738 |
19 | మహారాష్ట్ర | 318695 | 175029 | 12030 |
20 | మణిపూర్ | 1925 | 1307 | 0 |
21 | మేఘాలయ | 466 | 66 | 4 |
22 | మిజోరం | 297 | 168 | 0 |
23 | ఒడిషా | 18110 | 12910 | 97 |
24 | పుదుచ్చేరి | 2092 | 1265 | 29 |
25 | పంజాబ్ | 10510 | 7118 | 262 |
26 | రాజస్థాన్ | 30390 | 22195 | 568 |
27 | తమిళనాడు | 175678 | 121776 | 2551 |
28 | తెలంగాణ | 46274 | 34323 | 422 |
29 | త్రిపుర | 3079 | 1845 | 7 |
30 | ఉత్తరాఖండ్ | 4642 | 3212 | 55 |
31 | ఉత్తర ప్రదేశ్ | 51160 | 30831 | 1192 |
32 | పశ్చిమ బెంగాల్ | 44769 | 26418 | 1147 |
భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య | 1155191 | 724578 | 28084 |
క్రియాశీల కేసుల విషయానికి వస్తే.. గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం నాలుగు లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. అత్యంత చురుకైన కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలోని ఆసుపత్రులలో లక్ష మందికి పైగా కరోనా సోకిన వారు చికిత్స పొందుతున్నారు. రెండో స్థానంలో తమిళనాడు, కర్ణాటక మూడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో, ఢిల్లీ ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యంత చురుకైన కేసులు ఉన్నాయి.