భారత్‌లో ఊరట కలిగించే వార్త: కరోనా రికవరీ రేటు 51.5 శాతం

  • Publish Date - June 14, 2020 / 04:19 AM IST

కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు ఇప్పుడు 3,20,922 కు పెరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,62,379మంది కోలుకోగా మరో 1,49,348 మంది చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 9,195 మంది రోగులు కరోనాతో చనిపోగా దేశంలో కరోనా నుండి కోలుకుంటున్న రోగుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1,62,379 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో, 1,49,348 క్రియాశీల కేసులు ఉండగా.. రోగుల రికవరీ రేటు 51.5 శాతానికి మించిపోయింది.

గత 24 గంటల్లో దేశంలో 11,929 కరోనా వైరస్ కేసులు నమోదవగా.. ఈ కాలంలో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 311. ఇదిలాఉంటే, కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

9650 మరణాలతో బెల్జియం 8వ స్థానంలో ఉండగా, 8867మరణాలతో జర్మనీ 10స్థానంలో కొనసాగుతోంది. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.