కోవిడ్-19 ప్రభావం ఆర్ధిక వ్యవస్థలపై భాగా పడింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో ఈ నెల 25 వరకూ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని నిలిపివేయాలని Samsung, Oppo, Vivo మొబైల్ తయారీ కంపెనీలు ఈ ప్రకటన చేశాయి.
యూపీలో పూర్తి లాక్‌డౌన్ ప్రకటించిన క్రమంలో ఆ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో తదుపరి ఉత‍్తర్వులు వచ్చేవరకు ఈ ప్లాంట్లు తెరుచుకోవని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్ టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ర్టానిక్ వస్తువులన్నీ ఈ ప్లాంట్‌లో తయారవుతాయి.
నోయిడా ప్లాంట్ మూసివేసినా ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని శాంసంగ్ కోరింది. వివో కూడా తమ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఇంటినుంచి పని చేయమని తెలిపింది. ఇదిలా ఉంటే.. మరోవైపు నోయిడా, పుణే ప్లాంట్‌లలో LG ఉత్పత్తిని కూడా నిలిపివేసింది. కేవలం 50 శాతం సిబ్బందితో ఫ్యాక్టరీలో ఉత్పత్తి కొనసాగుతోందని ఎరిక్సన్ ఓ వార్తాసంస్థకు వెల్లడించింది.