కరోనా వ్యాప్తి కంటే ప్రచారమే భయంకరంగా మారింది. నిర్లక్ష్యం పనికిరాదని జాగ్రత్త తప్పనిసరి అని చెప్తుంటే అది ఇంకాస్త పెరిగి.. తీవ్ర రూపం దాల్చింది. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మాడని దానిపై నుంచి తోసేసి చితకబాదారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో వీడియో రికార్డు అయింది.
గుజారీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ వీడియోలో మరో బైక్ రైడర్ ఆ వ్యక్తిని చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఆపాడు. పబ్లిక్‌లో ఎందుకు తుమ్మావని.. ముఖానికి హ్యాండ్ ఖర్చీఫ్ లాంటిది ఎందుకు అడ్డుపెట్టుకోలేదని ప్రశ్నించాడు.
ఇలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని.. నీ లాంటి వాళ్ల అజాగ్రత్తే కొంపముంచుతుందని తిట్టారు. తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యా లేదని చెప్తున్నా వినకుండా పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనతో గంటల కొద్దీ ట్రాఫిక్ జాం అయినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
మహారాష్ట్రలో ప్రస్తుతం 49కరోనా కేసులు కన్ఫామ్ అయ్యాయి. ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం.. వైరస్ అనేది ఉమ్మడం, తుమ్మడం, దగ్గడం, ఇతరులను తాకడం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
More News On Corona Virus:
* ఏపీలో మూడుకు చేరిన కరోనా కేసులు
* తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా వైరస్: 16కు చేరిన బాధితుల సంఖ్య
* కరోనా భయంతో కిరాణా సరుకులు కొని స్టాక్ పెట్టేందుకు మార్కెట్లకు పరుగులు!