కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రదాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పలు సూచనలు చేశారు. భారతదేశంలో కరోనా రాకాసి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో..వైరస్ కట్టడికి సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలతో సహా..వివిధ రంగాల ప్రముఖులకు మోడీ సూచించారు.
దీంతో సోనియా 2020, ఏప్రిల్ 07వ తేదీ మంగళవారం..లేఖ రాశారు. మొత్తం 5 సూచనలు చేశారు. మీడియాలో ఇచ్చే ప్రకటనలపై రెండేళ్ల పాటు నిషేధం విధించాలని, నూతన పార్లమెంట్ విస్టా ప్రాజెక్ట్ ను ఆపివేయాలని, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ లోనే కార్యకలపాలు కొనసాగించాలన్నారు. అంతేగాకుండా..ప్రభుత్వ ఖర్చును 30 శాతం తగ్గించుకొవాలని సూచించారు.(కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నయా స్కెచ్)
కేంద్ర మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలన్నారు. పీఎం కేర్స్ నిధులు, పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కు బదిలీ చేయాలన్నారు సోనియా గాంధీ. ఎంపీల జీతాల కోతకు మద్దతిస్తున్నామన్నారు.