పంజాబ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బంద్

భారతదేశంలో మొత్తం కరోనా 166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ప్రజలు బయట తిరగడం మానేస్తున్నారు. వీటితో పాటు జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు తిరగొద్దని సూచనలు వస్తుండటంతో అక్కడక్కడే కనిపిస్తున్నారు. ప్రయాణంలో ఎక్కువ మంది కలిసి ప్రయాణించాల్సి వస్తుందని.. వారిని కూడా అదుపు చేయాలని చూస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది పంజాబ్ ప్రభుత్వం. 

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మొత్తాన్ని బంద్ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో మార్చి 21నుంచి అన్నీ సర్వీసులు రద్దు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. బస్సులు, ఆటోలు, మినీ వ్యాన్లు మార్చి 20అర్ధరాత్రి నుంచి తిరగడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టింది. ఇప్పటికే ప్రయాణంలో ఉన్నవారు రేపటికల్లా గమ్యస్థానాలకు చేరుకుంటారని ముందస్తుగానే హెచ్చరించినట్లు తెలిపింది. 20మందికి మించి ప్రజలు ఒకేచోట ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  (ఐసోలేషన్ సెంటర్లుగా మారిపోయిన 10ప్రైవేట్ హాస్పిటళ్లు)

దేశం మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేవ్, చండీఘడ్‌లలో ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు.  ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 18) ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ కరోనా కట్టడిపై ఫోకస్ పెట్టారు. సీఎం కేసీఆర్ గురువారం(మార్చి 19) మధ్యాహ్నం రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిగా ఆలస్యంగా విద్యా సంస్థలు రద్దు అయ్యాయి. కరోనా ప్రభావం కనిపించకపోవడంతో అంతగా పట్టించుకోని ఆంధ్ర గవర్నమెంట్ గురువారం నుంచి సీరియస్ యాక్షన్‌లకు తెరలేపింది.