భయపెట్టిన రూ. 500 నోట్లు…కారణం ఏంటో తెలుసా

  • Publish Date - April 11, 2020 / 01:59 AM IST

రోడ్లపై డబ్బులు పడితే ఏం చేస్తారు ? వెంటనే తీసుకుని ఎవరు పడేసుకున్నారో అని ఆరా తీస్తాం అంటారు కదా. కానీ ప్రస్తుతం ఎక్కడైనా నోట్లు కనపడితే చాలు..అమాంతం దూరం పరుగెడుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ కారణం. నోట్లపై ఈ వైరస్ ఉంటుందని, అది ముట్టుకుంటే…వ్యాధి ఎక్కడ సోకుతుందనే భయం అందరిలో నెలకొంది. దీంతో రోడ్లపై పడిన డబ్బులను ఎవరూ ముట్టుకోవడం లేదు. ఇలాంటి ఘటన లఖ్నో నగరంలో చోటు చేసుకుంది. రోడ్డుపై పడి ఉన్న రెండు రూ. 500 నోట్లను ఎవరూ ముట్టుకోలేదు. స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. 

పేపర్ మిల్ కాలనీలో 2020, ఏప్రిల్ 09వ తేదీ గురువారం రాత్రి కాలనీకి వెళ్లే రోడ్డుపై రెండు రూ. 500 నోట్లు పడి ఉండటాన్ని గమనించారు. వాటిని తీసుకోవడానికి వెనుకంజ వేశారు. వైరస్ వ్యాప్తి చేయ్యడానికే గుర్తు తెలియని వ్యక్తులు ప్లాన్ చేశారని అనుమానించారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 

వెంటనే హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు రోడ్డుపై పడి ఉన్న రెండు రూ. 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి అందరూ వెళ్లిపోవాలని సూచించారు. వీటిని స్థానికంగా ఉన్న వైద్యుడిని దగ్గరకు తీసుకెళ్లారు. 24 గంటల పాటు..ఈ నోట్లను ముట్టుకోవద్దని సూచించారు. దీనికి సంబంధించిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. 
 

Also Read | హైదరాబాద్ నారాయణగూడలో కరోనా లక్షణాలతో చనిపోయిన వృద్ధుడు