దేశంలో 8కి చేరిన కరోనా మృతుల సంఖ్య

  • Publish Date - March 23, 2020 / 04:47 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యానికి మృతుల సంఖ్య వేల సంఖ్యలో ఉండగా.. బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే భారత్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో 74కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

అయితే లేటెస్ట్ భారత్‌లో చనిపోయినవారి సంఖ్య 8కి చేరుకుంది. కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదదవగా.. ఇవాళ కరోనా మరణంతో మహారాష్ట్రాలో కరోనా మృతుల సంఖ్య 3కు చేరుకుంది. ఆ రాష్ట్రంలో 144సెక్షన్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇవాళ చనిపోయిన వ్యక్తి 65ఏళ్ల వ్యక్తిగా చెబుతున్నారు. అతను ఫిలిప్పైన్స్‌ వ్యక్తిగా వెల్లడించారు.

ప్రస్తుతంమ మహారాష్ట్రలో కరోనా స్టేజ్‌3 దిశగా పయనిస్తోంది. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందది. విదేశాల నుంచి వచ్చిన వారు దయచేసి బయట తిరగవద్దని ప్రభుత్వం కోరుతుంది. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచనలు చేస్తున్నారు.

see Also | దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌లోకి వెళ్లిన 80 నగరాలు