కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో

  • Publish Date - November 12, 2020 / 09:31 AM IST

Coronavirus Turmoil Raises Depression Risks : కరోనా ఎన్నో సమస్యలను సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ, నరాల వ్యవస్థ, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. తాజాగా మానసిక సమస్యలను సృష్టిస్తున్నట్లు ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. మెదడుపై ప్రభావం చూపడంతో పాటు నిద్రలేమి, మనో వ్యథ, కుంగుబాటు, ఒత్తిళ్లు, ఆందోళన, అయోమయం వంటి మానసిక అనారోగ్యాలకు కారణమౌతుందని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో, మృత్యువు అంచు వరకు వెళ్లిన వారిలో ఈ మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపింది.



అమెరికాలోని పలు వైద్యపరిశోధన సంస్థలు తాజాగా లక్షలాది మంది పేషెంట్ల హెల్త్‌రికార్డ్‌లు (62 వేల మంది కోవిడ్‌ పేషెంట్లతో సహా) పరిశీలించి.. మానసిక అనారోగ్య అంశాలు, సమస్యలపై లోతైన విశ్లేషణ నిర్వహించాయి. కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వారిలో 20 శాతం కంటే ఎక్కువ మందిలో 90 రోజుల్లోనే మానసిక వ్యాకులత, కుంగుబాటుతో మెదడుపై ప్రతి కూల ప్రభావాలు బయటపడినట్టు ఇవి గుర్తించాయి.



మానసిక అనారోగ్య అంశాలు, సమస్యలపై లోతైన విశ్లేషణ నిర్వహించాయి. వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 20 శాతం ఎక్కువ మందిలో 90 రోజుల్లోనే మానసిక వ్యాకులత, కుంగుబాటుతో మెదడుపై ప్రతికూల ప్రభావాలు బయపడినట్లు గుర్తించాయి. ఈ వివరాలన్నీ ఇటీవల లాన్సెట్ సైకియాట్రీ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. కుంగుబాటు, ఒత్తిళ్లు వంటి మానసిక సమస్యలున్న వారికి ఇతరులతో పోలిస్తే..65 శాతం మేర కోవిడ్ – 19 సోకే అవకాశాలెక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. కరోనా కారణంగా ఆందోళన, భయాల వల్ల మానసిక సమస్యలు కలుగుతుండొచ్చని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సైమన్ వెస్లీ అంటున్నారు.



మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటుతో బాధ పడే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందని, కాబట్టి వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. కోవిడ్ అంటే ముందే ఏర్పడిన భయంతో…పాజిటవ్ వచ్చాక మరింతగా కృంగిపోతున్నారని తెలిపారు. దీనికంతటికి భయమే పెద్ద సమస్య అన్నారు.

ట్రెండింగ్ వార్తలు