వరుసగా రెండవరోజు భారత్‌లో 8వేలకు పైగా కరోనా కేసులు..

  • Publish Date - June 1, 2020 / 05:05 AM IST

భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో ఏకంగా  దేశంలో రికార్డుస్థాయిలో 8,392 మందికి కొత్తగా కరోనా సోకగా, 230 మంది చనిపోయారు.

జాతీయ స్థాయిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,90,535కి చేరుకుంది. ఇప్పటివరకు 5,394 మంది చనిపోగా.. 93,322 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,819 మంది కోలుకున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.

ఇక మొత్తం ప్రపంచంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 61 మిలియన్లను దాటింది. ఇప్పటివరకు 3 లక్షలకు పైగా 72 వేల మంది చనిపోయారు. అమెరికా ఎక్కువగా ప్రభావితమైన దేశం కాగా, ఈ జాబితాలో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. బ్రెజిల్లో, కరోనా వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. 5 లక్షలకు పైగా కేసులు మరియు 29 వేల మరణాలు అక్కడ సంభవించాయి.

దేశాలవారీగా కేసులు.. మరణాలు..:
అమెరికా: 1,790,172 కేసులు, 104,381 మరణాలు.
బ్రెజిల్: 514,849 కేసులు, 29,314 మరణాలు.
రష్యా: 405,843 కేసులు, 4,693 మరణాలు
యునైటెడ్ కింగ్‌డమ్: 276,156 కేసులు, 38,571 మరణాలు.
స్పెయిన్: 239,479 కేసులు, 27,127 మరణాలు.
ఇటలీ: 232,997 కేసులు, 33,415 మరణాలు.
భారతదేశం: 190,392 కేసులు, 5,394 మరణాలు.
ఫ్రాన్స్: 189,009 కేసులు, 28,805 మరణాలు
జర్మనీ: 183,410 కేసులు, 8,540 మరణాలు.
పెరూ: 164,476 కేసులు, 4,506 మరణాలు 

Read: India Lockdown 5.0 : 72 రోజులు