కొత్త కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రపంచం అంతా పోరాడుతుంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతుండగా.. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,304కేసులు కొత్తగా నమోదయ్యాయి. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కాగా.. ఇదే సమయంలో 260 మంది చనిపోయారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,16,919కేసులు నమోదవగా.. మృతుల సంఖ్య 6,075 కి చేరుకుంది. 1,06,737 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,107 మంది కోలుకున్నారు.
దేశంలో కొరోనావైరస్ కారణంగా దెబ్బతిన్న రాష్ట్రంగా అవతరించిన మహారాష్ట్రలో ఇప్పటివరకు 74,860 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,587మంది చనిపోగా.. 32,329మంది కోలుకున్నారు. తర్వాత తమిళనాడులో 25,872 కేసులు నమోదవగా..దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 23,645 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలోని కోవిడ్ -19 సంఖ్య 23,000 దాటింది. గుజరాత్‌లో ఇప్పటివరకు 18,100 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర తరువాత అత్యధిక ప్రాణనష్టానికి గురైన రాష్ట్రాలు గుజరాత్ (1,122), ఢిల్లీ (606), మధ్యప్రదేశ్ (371), పశ్చిమ బెంగాల్ (345).
8,000 కేసులకు పైగా ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్ (9,652), ఉత్తర ప్రదేశ్ (8,729), మధ్యప్రదేశ్ (8,588).
కరోనా కేసులు 2,000 మార్కులు దాటిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ (6,508), బీహార్ (4,390), ఆంధ్రప్రదేశ్ (4,080), కర్ణాటక (4,063), తెలంగాణ (3,020), హర్యానా (2,954), జమ్మూ కాశ్మీర్ (2,857), పంజాబ్ (2,376), ఒడిశా (2,388).