Gslv
GSLV-F10 : GSLV రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో బుధవారం 3.43 గంటలకు ఇస్త్రో శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఇస్రో ఛైర్మన్ శివన్ నేతృత్వంలో షార్ లో మిషన్ సంసిద్ధత సమావేశ నిర్వహించారు. దశల వారీగా..రాకెట్ అనుసంధానంపై చర్చించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ప్రయోగానికి అధికారికంగా అనుమతినిచ్చారు. ప్రయోగ పనులను లాంచ్ అథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగించారు.
Read More : IIT-H, KMC : సంతాన లేమి…బాధ పడుతున్నారా ? చింతపడకండి
ల్యాబ్ చైర్మన్ అర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మధ్యాహ్నం మరోసారి సమావేశమయ్యారు. ఇందులో కౌంట్ డౌన్ ప్రయోగంపై చర్చించారు. బుధవారం ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 26 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. గురువారం ఉదయం 5.43గంటలకు GSLV-F10 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 2 వేల 268 కిలోల బరువున్న జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే..భూ పరిశీలన అంశాలను తెలుసుకొనే వీలుందంటున్నారు.
Read More : Viral Video: మాస్క్‌తో భయపెట్టే ఫ్రాంక్.. చివరికి కటకటాల పాలు!