Ashok Gehlot warns bjp: ఇలాగైతే భారత్‌లో అంతర్యుద్ధం వస్తుంది: సీఎం అశోక్ గహ్లోత్ వార్నింగ్

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ద్వేషం, ఆందోళన, హింస దేశంలో చోటుచేసుకుంటోందని గహ్లోత్ చెప్పారు. దీనిపై దేశం మొత్తం ఆందోళన చెందుతోందని అన్నారు. ప్రేమ, సోదరభావం, సామరస్యంతో మెలగాలని, హింస ఉండకూడదని ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందేశం ఇవ్వాలని అశోక్ గహ్లోత్ చెప్పారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు ఈ పని చేయలేదని ఆయన అన్నారు. దేశంలో కులం, మతం పేరిట ద్వేషాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. దీన్ని నియంత్రించకపోతే అంతర్యుద్ధం దిశగా వెళ్తామని అన్నారు.

Ashok Gehlot warns bjp: దేశంలో కుల, మతాల పేరిట ద్వేషాన్ని కొనసాగనిస్తే అంతర్యుద్ధం వస్తుందని రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి భారత్ జోడో యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కన్యాకుమారిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ… దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ జోడో నినాదం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్పుకొచ్చారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ద్వేషం, ఆందోళన, హింస దేశంలో చోటుచేసుకుంటోందని గహ్లోత్ చెప్పారు. దీనిపై దేశం మొత్తం ఆందోళన చెందుతోందని అన్నారు. ప్రేమ, సోదరభావం, సామరస్యంతో మెలగాలని, హింస ఉండకూడదని ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందేశం ఇవ్వాలని అశోక్ గహ్లోత్ చెప్పారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు ఈ పని చేయలేదని ఆయన అన్నారు.

దేశంలో కులం, మతం పేరిట ద్వేషాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. దీన్ని నియంత్రించకపోతే అంతర్యుద్ధం దిశగా వెళ్తామని అన్నారు. దేశాన్ని ఏకం చేయడానికి భారత్ జోడో యాత్ర ఇస్తున్న సందేశాన్ని తెలుసుకుని, దాని ప్రకారం మెలగాలని ప్రధాని మోదీ, అమిత్ షాకు ఆయన సూచించారు. లేదంటే ప్రస్తుత తరం వారిని క్షమించబోదని చెప్పుకొచ్చారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు

ట్రెండింగ్ వార్తలు