రాజధాని ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రమత్తం చేశారు. హర్యానా అసెంబ్లీ సమావేశాలకు భద్రతను కట్టుదిట్టం చేస్తూ బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. విజిటర్ పాసులను ఒక గంట మాత్రమే చెల్లుబాటయ్యేలా జారీ చేయాలని నిర్ణయించారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్ పోలీసులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బందిని సైతం అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయించారు.