ప్రియాంకా గాంధీ ‘దొంగ భార్య’ : ఉమాభారతి

బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్రమంత్రి ఉమాభారతి మరోసారి తననోటికి పనిపెట్టారు. ఈసారి ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యఖ్యలు చేశారు.

  • Publish Date - April 17, 2019 / 10:11 AM IST

బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్రమంత్రి ఉమాభారతి మరోసారి తననోటికి పనిపెట్టారు. ఈసారి ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యఖ్యలు చేశారు.

బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్రమంత్రి ఉమాభారతి మరోసారి తననోటికి పనిపెట్టారు. ఈసారి ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యఖ్యలు చేశారు. ప్రియాంకగాంధీ ‘దొంగ భార్య’ అంటు వ్యాఖ్యానించారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చి చేసేదేమీ లేదనీ..ఆమె ప్రభావం యూపీ ఎన్నికలపై ఉండదన్నారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దుర్గ్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఉమాభారతి మీడియాతో మాట్లాడుతు ఈ వ్యాఖ్యలు చేశారు. 
Also Read : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు ఇవే

ఆమె భర్త రాబర్ట్ వాద్రా చోరీ ఆరోపణలు ఎదర్కొంటున్నారనీ..ప్రియాంక దొంగ భార్యగా దేశంలో ప్రజలకు కనిపిస్తోందంటు ఉమాభారతి ఆరోపించారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోతారనే భయంతోనే కేరళలోని వయనాడ్ లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు వేయాలని ఉమాభారతి డిమాండ్ చేశారు. 
Also Read : కోట్లున్నక్రికెటర్ : ఫుట్ పాత్ పై వాచ్ కోసం గీసి గీసి బేరం