ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై డాక్టర్లు యుద్ధం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గంటలకు గంటలు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(PPE) కిట్లు వేసుకుని పనిచెయ్యాల్సిన పరిస్థితి డాక్టర్లది. ఈ క్రమంలో వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత కారణంగా డాక్టర్లు పలురకాల రుగ్మతలకు గురవుతున్నారు.
పీపీఈ కిట్లు ధరించకుంటే కరోనా వైరస్ కాటేస్తుంది. అవి వేసుకుంటే.. డీహైడ్రేషన్, దురద, చెమట పొక్కులు, బబుల్స్ వంటి చర్మవ్యాధులతో పాటు మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. మరికొంత మందిలో తలపై జుట్టు ఊడిపోతోందని డాక్టర్లు చెబుతున్నారు.
తెలంగాణలోని కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సుమారు రెండు వేల మంది వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్, శానిటేషన్, అంబులెన్స్ సిబ్బంది, లిఫ్ట్ ఆపరేటర్, పేషెంట్ కేర్ టేకర్‌తోపాటు పోలీస్ సిబ్బంది కరోనా విధులు నిర్వహిస్తున్నారు.
వీరంతా తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాల్సిందే. వీరిలో పల్మనాలజీ, జనరల్‌మెడిసిన్ వంటి ఫ్రంట్ లైన్ వైద్యులు, జూనియర్ డాక్టర్లు, ఇంటర్నీస్, హౌస్ సర్జన్లతోపాటు నర్సింగ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి 8 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారు.
చర్మం పీపీఈ మరియు చర్మం మధ్య ఘర్షణ గుణకం పెరిగింది, మరియు ముసుగులు మరియు గాగుల్స్ త్వరగా తొలగించబడినప్పుడు, చర్మం కన్నీరు జరగడానికి సిద్ధంగా ఉంది” అని ఒక అధ్యయనం చెబుతోంది, డ్యూటీలో గంటలు పిపిఇలు ధరించేటప్పుడు వైద్యులు ప్రతిరోజూ ఏమి చేస్తారో సూచిస్తుంది.
COVID-19 కి వ్యతిరేకంగా యుద్ధంలో వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE)లో ముసుగులు, చేతి తొడుగులు, హుడ్డ్ క్యాప్స్, ఫేస్ షీల్డ్స్, గాగుల్స్, గౌన్లు, షూ కవర్లు ఉన్నాయి. వీటివల్ల గంటలకు గంటలు వాళ్లు స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకునే అవకాశం లేదు. చాలా మంది డాక్టర్లు PPEలను తొలగించిన తర్వాత వారి ముఖాలపై గుర్తులు, మొటిమలు, ఎర్రగా మారిపోయి ముఖం అంతా గాయాలు కనిపిస్తున్నాయి.
అయితే డీహైడ్రేషన్ సమస్య పరిష్కరించేందుకు ఎక్కువగా నీరు తాగుతున్నారు. అలాగే ఓఆర్‌ఎస్ ద్రావణంతోపాటు కొబ్బరి నీళ్లు తగిన మోతాదులో తీసుకుంటున్నారు. అయితే డాక్టర్లు మాత్రం ఇటువంటి పరిస్థితిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు.
Read: సెమిస్టర్ పరీక్ష 30 మార్కులకే, ఇంజినీరింగ్ విద్యలో సమూల మార్పులు