Covid-19 : మహారాష్ట్రలో 67మంది వైద్యులు, 19 మంది నర్సులను బలిగొన్న కరోనా..!

దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభించింది. కరోనా ధాటికి వేలాది సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి.

In Maharashtra, Covid 19 Cl

Covid-19 Updates : దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభించింది. కరోనా ధాటికి వేలాది సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కరోనా బాధితులకు రక్షణగా వైద్యం అందించిన డాక్టర్లు, నర్సులు సైతం మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కరోనా వ్యాపించింది. అందులో ఎక్కువగా మహారాష్ట్రను కరోనా బెంబేలిత్తించింది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులతో ముంబై సహా పలు నగర ప్రాంతాలు వణికిపోయాయి.

కరోనా కట్టడి చర్యల్లో మహా ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. నైట్ కర్ఫ్యూ, వారంతపు కర్ఫ్యూ ఇలా ఎన్నో కరోనా నిబంధనలను అమలు చేసింది. థర్డ్ వేవ్ ప్రభావంతో ముంబై నగరం వణికిపోయింది. కరోనా కారణంగా మహారాష్ట్రలో కరోనా బాధితులతో పాటు వారికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు కూడా తమ ప్రాణాలను కోల్పోయారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెసి వేణుగోపాల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

మహారాష్ట్రలో, కరోనా కారణంగా ఇప్పటివరకూ 67 మంది వైద్యులు, 19 మంది నర్సులు మరణించారని మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ఇక గుజరాత్‌లో కరోనా కారణంగా మొత్తం 20 మంది వైద్యులు, 20 మంది నర్సులు, 6 అంబులెన్స్ డ్రైవర్లు, 128 మంది పారామెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. కరోనాను కట్టడిలో భాగంగా వైరస్ బాధితులకు చికిత్స అందించిన హెల్త్ వర్కర్లను మాండవ్య అభినందించారు.

దేశవ్యాప్తంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మొత్తం కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ సహా మూడో వేవ్ సమయంలో పగలు రాత్రి తేడా లేకుండా పని చేశారని ఆయన కొనియాడారు. దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యను కేంద్రం దాచలేదని మాండవ్య స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా కేంద్రం  కరోనా మరణాలపై డేటాను పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన అన్నారు. దేశంలో ఇప్పటివరకు సుమారు 5.33 లక్షల కరోనా మరణాలు నమోదయ్యాయి. అందులో కేరళ 20వేల కన్నా ఎక్కువ కరోనా మరణాలను నమోదైనట్టు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాండవ్య వివరించారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 4, 23, 39, 611కి చేరుకుంది. దేశంలో ఇప్పుడు 9,94, 891 యాక్టివ్ కరోనావైరస్ కేసులు ఉన్నాయి. ఒక రోజులో 10.2 శాతం మేర తగ్గింది. ఒక రోజు ముందు 11,08,938గా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. దేశంలో గత 24 గంటల్లో 67,597 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి, వరుసగా రెండవ రోజు 1 లక్ష కంటే తక్కువ రోజువారీ ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. దేశంలో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 4, 23, 39, 611కి చేరుకుంది. అలాగే మొత్తంగా 9,94, 891 యాక్టివ్ కరోనావైరస్ కేసులు ఉన్నాయి.

Read Also : Hijab Row: స్కూల్స్, కాలేజీలు మూడు రోజులు క్లోజ్… శాంతి, సామరస్యంతో ఉండాలని సీఎం పిలుపు