Covid-19 India : దేశంలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు, 24 మరణాలు

Covid-19 India : దేశంలో స్వల్పంగా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2827 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 24 మరణాలు నమోదయ్యాయి.

Covid-19 India : దేశంలో స్వల్పంగా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2827 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 24 మరణాలు నమోదయ్యాయి. 4.71 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. 2,827 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.74 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం (మే 12) హెల్త్ బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం దేశంలో 19,067 కరోనా యాక్టివ్ (0.04 శాతం) కేసులు ఉన్నాయి.

కొత్త కరోనా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,13,413కి చేరింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,24,181కి పెరిగింది. బుధవారం ఒక్కరోజే కరోనా నుంచి 3,230 మంది కోలుకున్నారు. దాంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,25,70,165కి చేరింది.

Covid 19 India India Reports 2,827 New Covid 19 Cases, 24 Deaths In Last 24 Hours

మరోవైపు.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 190,83,96,788 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. బుధవారం 14,85,292 మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా 4,71,276 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో మొత్తంగా 84.24 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనాతో ఇప్పటివరకూ 1.22 శాతం మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read Also : Covid-19 Vaccine : కొవిడ్ టీకా తీసుకున్నారా? రెండు డోసులకు ఒకటే మొబైల్ నెంబర్‌ తప్పనిసరి..!

ట్రెండింగ్ వార్తలు