Pregnants Must Take Vaccine : కరోనా వల్ల ప్రసవం ముందే అయ్యే అవకాశం..గర్భిణులు త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండీ

కోవిడ్ వ్యాక్సిన్లు వేయించుకోవటంలో గర్భిణులు నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. కరోనా సోకిన గర్భిణులకు ముందస్తు ప్రసవమయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. దీంతో వీలైనంత త్వరగా గర్భంతో ఉన్న మహిళలు టీకాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Pregnants Must Take Vaccine : కరోనా. పుట్టులను కూడా ప్రశ్నార్థం చేస్తోంది.ఈ కరోనా సమయంలో గర్భం దాల్చాలంటే కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఆల్రెడీ గర్బం దాల్చినవారు వ్యాక్సిన్ వేయించుకోవాలా? వద్దా? వేయించుకుంటే ఏమవుతుంది? వేయించుకోకపోతే కరోనా బారిన పడతామా? వైరస్ సోకిని బిడ్డ ఆరోగ్యం పరిస్థితి ఏంటీ? ఇలా ఎన్నో సందేహాలు. మరెన్నో భయాందోళనలు. కానీ కరోనా అయినా..మరొకటి అయినా కాలం ఆగదు..ప్రకృతి ధర్మం ఆగదు. ఈక్రమంలో గర్భం దాల్చిన మహిళలు ఈ కరోనా సమయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. పలు సూచనలు చేస్తున్నారు. కానీ కరోనా కాలంలో గర్బిణులు..వారి ఆరోగ్య పరిస్థితి. మానసిక పరిస్థితి. ప్రసవం సమయం అన్నీ అన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన అంశాలే. ఈక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ గర్భిణులకు పలు కీలక సూచనలు చేసింది.

కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో గర్భిణులు నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. అలాగే కరోనా సోకిన గర్భిణులకు ముందస్తు ప్రసవమయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. దీంతో వీలైనంత త్వరగా గర్భంతో ఉన్న మహిళలు టీకాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం (జులై 9,2021) ప్రకటించింది. గర్భంతో ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందోననే భయాందోళనలు వద్దని వ్యాక్సిన్ ప్రమాదకరం కాదని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. అందువల్ల పుకార్లను..అపోహలను నమ్మకుండా గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె పాల్ తెలిపారు.

“గర్భిణీ స్త్రీలలో కోవిడ్-19 ప్రభావం ఇతరులకన్నా భిన్నంగా ఉండదు. కానీ గర్భంతో ఉన్నందువల్ల వారి శరీర వ్యవస్థ అందరిలా ఉండదు. దీంతో వీరిపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల మహమ్మారి ప్రభావాన్ని నిరోధించేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలి” అని డాక్టర్ పాల్ వివరించారు. గర్భిణులకు కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలను గర్భంతో ఉన్న మహిళలు తీసుకోవచ్చని మార్గదర్శకాల్లో వెల్లడించారు. ఈ క్రమంలో టీకాలు గర్భిణులకు కోవిడ్ ముప్పును తగ్గిస్తాయని వి.కె. పాల్ తెలిపారు. కానీ..‘గర్భంతో ఉన్నవారికి కోవిడ్ సోకితే నెలలు నిండక ముందే ప్రసవమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల తల్లీ బిడ్డలు ఇద్దరూ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి కోవిడ్ టీకాలు ఇటువంటి సమస్యలను నివారిస్తాయని పాల్ వెల్లడించారు.

కాగా భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. కానీ క్లినికల్ ట్రయల్స్‌లో గర్భిణీ స్త్రీలను చేర్చలేదు. దీంతో గర్భిణులు వ్యాక్సిన్లు తీసుకోవడానికి ప్రారంభంలో అనుమతించలేదు. కానీ ఆ తరువాత నిర్వహించిన అధ్యయనాలు మాత్రం.. గర్భంతో ఉన్న వారికి వీలైనంత త్వరగా కోవిడ్ టీకాలు ఇవ్వాలని తెలపటంతో..కేంద్ర ప్రభుత్వం గర్భిణులకు వ్యాక్సిన్ల వేయాలని సిఫారసు చేసింది. టీకా తీసుకునే ముందు గర్భిణీ స్త్రీలు ఎటువంటి అదనపు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని మార్గదర్శకాల్లో పొందుపరిచింది. అలాగే వ్యాక్సిన్ వేయించుకుంటే సంతానోత్పత్తిపై ఎటువంటి ప్రభావం చూపదని కూడా తెలిపింది. వివిధ రకాల కరోనా వైరస్ వేరియంట్లు వెలుగులోకి వస్తున్న క్రమంలో గర్భిణులు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని మేము గట్టిగా సిపార్సు చేస్తున్నామని డాక్టర్ పాల్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు