Lockdow కొనసాగింపే సరైందనే ఎక్కువ శాతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎందుకంటే వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందని వెల్లడిస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేస్తే..సోషల్ డిస్టెన్స్ పాటించడం కష్టతరమౌతుందని, ఇన్ని రోజులు చేసిన శ్రమంతా వృధా అవుతోందని అంటున్నాయి. వైరస్ విరుగుడుకు సరైన మందు ఇప్పటికీ లభ్యం కాలేదన్న విషయాన్ని గుర్తుకు పెట్టకోవాలని సూచిస్తున్నాయి.
భారతదేశ వ్యాప్తంగా 2020, మే 03వ తేదీతో లాక్ డౌన్ ముగియనుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మే 07వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించింది. లాక్ డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి. అయినా పాజిటివ్ కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగించాలనే వ్యూహాన్ని అమలు చేస్తారని టాక్.
లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలోనే పలు దుకాణాలకు వెసులుబాటు కల్పిస్తూ..కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం బాహాటంగానే తప్పుబడుతోంది. ఎందుకంటే అక్కడ 2 వేల 625 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 54 మంది చనిపోయారు. ఢిల్లీలో ఇలా ఉంటే..మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 6 వేల 817 పాజిటివ్ కేసులు నమోదు కాగా…301 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని అంటున్నారు.
గుజరాత్, రాజస్థాన్, తమిళనాడుతో పాటు యూపీ రాష్ట్రంలో కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే…ఏపీలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో 2020, ఏప్రిల్ 25వ తేదీ ఏడు కేసులు మాత్రమే రికార్డయ్యాయి. మొత్తానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలున్నాయని వైద్య రంగానికి చెందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
వలస కూలీలను రాష్ట్రాలకు తిరిగి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకు అంతరాష్ట్ర సడలింపులు చేయాలని కేరళ, ఏపీ, బీహార్ ముఖ్యమంత్రులు కోరే అవకాశం ఉంది. ఎక్కువగా పాజిటివ్ కేసులు, హాట్ స్పాట్ ప్రాంతాలకు లాక్ డౌన్ పరిమితం చేయాలని ఏపీ, కర్నాటక రాష్ట్రాలు కోరుతున్నాయి. లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? అనే దానిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఇదిలా ఉంటే..కేంద్ర ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను అమలు చేస్తామని బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బహిరంగ సభలకు అనుమతించకూడదని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రివర్గ సమావేశం చర్చిస్తామని బీహార్ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి బల్బీర్ సింగ్ తెలిపారు. లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? అనే దానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సలహాలు, సూచనల మేరకు వెళుతామని సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మే 03 తర్వాత…లాక్ డౌన్ లో సడలింపు ఇచ్చే అవకాశం లేదని సమాచారం. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ.