4 నెలల్లో ఖచ్చితంగా కరోనా వ్యాక్సిన్ వస్తది : హర్షవర్థన్

COVID-19 Vaccine Will Be Ready In 3-4 Months వచ్చే 3-4నాలుగు నెలల్లో కరోనావ్యాక్సిన్ సిద్ధమవుతుందనే నమ్మకం తనకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. 135కోట్లమంది భారతీయులకు వ్యాక్సిన్ సరఫరా ప్రధాన్యత సైంటిఫిక్ నిర్ధారణ ఆధారంగా ఉంటుందన్నారు.

గురువారం(నవంబర్-19,2020)”The Shifting Healthcare Paradigm During and Post-Covid” అనే అంశంపై FICC FLO వెబినార్ లో హర్షవర్థన్ మాట్లాడుతూ…వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించి పరిశోధనలో మన సైంటిస్తులు మిగిలిన అందరికన్నా చాలా ముందున్నారు.



రాబోయే 3-4నెలల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఉంది. సైంటిఫిక్ డేటా ప్రాతిపదికగా వ్యాక్సిన్ సరఫరా ప్రాధాన్యత క్రమం నిర్ణయించబడుతుంది. సాధారణంగా వృద్ధులు,కరోనా ప్రమాదం అధికంగా ఉన్న వ్యక్తులు, హెల్త్ కేర్ వర్కర్లకు,కరోనా వారియర్స్ కి మొదటి ప్రధాన్యత ఉంటుంది. దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు పూర్తి వివరణాత్మక ప్రణాళిక సిద్దదమవుతోంది. దీని కోసం బ్లూ ప్రింట్ ని చర్చించేందుకు ఓ ఈ-వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేయబడింది. 2021మనందరికీ 2021 మంచి ఏడాదిగా ఉంటుందని ఆశిస్తున్నాను అని హర్షవర్థన్ అన్నారు.



https://10tv.in/fine-for-not-wearing-mask-in-delhi/
ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షవర్థన్ ప్రశంసలు కురిపించారు. గడిచిన కొన్ని నెలలుగా మహమ్మారిపై పోరాటానికి కేంద్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని హర్షవర్థన్ తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలో మన ప్రధానమంత్రి తీసుకున్న జనతా కర్ఫ్యూ నిర్ణయం వినూత్న మరియు అద్భుతమైన ప్రయోగం అని హర్షవర్థన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు దీనికి స్పందిచారన్నారు. ఆ తర్వాత లాక్ డౌన్ విధించడం,అన్ లాక్ విధించడం వంటివి మహమ్మారి సమయంలో కేంద్రం తీసుకున్న కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు అని హర్షవర్థన్ తెలిపారు. కరోనా చాలా ధీటుగా ఎదుర్కొన్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు