COVIDపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి.. దేశంలో కరోనా కనుమరుగయ్యే చాన్స్ ఉందని చెప్పింది. ఇప్పటికే వైరస్ పీక్ స్టేజ్ దాటేసిందని తెలిపింది. కేంద్ర మార్గదర్శకాలు, జాగ్రత్తలు విధిగా పాటిస్తే.. 4 నెలల్లోనే వైరస్ కంట్రోల్‌లోకి వస్తుందని తెలిపింది. శీతాకాలం, పండగ సీజన్‌లో కేసులు పెరిగే అవకాశముందని.. అంతా జాగ్రత్తలు పాటించాలని తెలిపింది కేంద్ర కమిటీ.
భారత్‌లో కరోనాను నియంత్రించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలన్నీ పాటిస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైరస్ కంట్రోల్‌లోకి వస్తుందని కేంద్రకమిటీ చెప్పింది. దేశంలో ఇప్పటికే కరోనా కేసులు పీక్ స్టేజ్ దాటేశాయని హెల్త్ కమిటీ స్పష్టం చేసింది. ఈ కమిటీలో.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌తో పాటు ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు.
రెండు వారాలుగా నమోదవుతున్న కేసుల సంఖ్యను.. గత నెలల్లో నమోదైన కేసులతో పోల్చి చూశారు. దీని ద్వారా.. దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోందనే అంచనాకు వచ్చారు. గతంలో రోజుకు 97 వేలకు పైగా కేసులు నమోదైతే.. ఇప్పుడా సంఖ్య 60 వేలకు పడిపోయింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 8 లక్షలలోపే ఉంటోంది. పండగల సీజన్, శీతాకాలంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. రక్షణ చర్యలు సరిగ్గా పాటిస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైరస్ కంట్రోల్‌కి వస్తుందని చెప్పారు కమిటీ సభ్యులు.
ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసులను బట్టి.. వచ్చే ఫిబ్రవరి నాటికి కరోనా బారిన పడిన బాధితులు కోటి 5 లక్షలకు చేరతారని కమిటీ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసులు 75 లక్షలకు చేరాయి. వైరస్ బారిన పడి.. ఇప్పటివరకు దేశంలో లక్షా 14 వేల మందికి పైగా చనిపోయారు.మరణాలు కూడా రోజుకు వెయ్యి లోపే నమోదవుతున్నాయి.రికవరీ రేటు కూడా 88 శాతానికి పెరిగింది….