Kerala’s Covid Cases : కేరళలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు

కేరళలో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ ఇవాళ భారీగా పెరిగాయి. కేరళలో గడిచిన 24గంటల్లో 11,079 పాజిటివ్ కేసులు, 123మరణాలు నమోదైనట్లు బుధవారం

Kerala’s Covid Cases  కేరళలో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ ఇవాళ భారీగా పెరిగాయి. కేరళలో గడిచిన 24గంటల్లో 11,079 పాజిటివ్ కేసులు, 123మరణాలు నమోదైనట్లు బుధవారం ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

గత 24 గంటల్లో మొత్తం 89,995శాంపిల్స్ ను టెస్ట్ చేశామని..టెస్ట్ పాజిటివిటీ రేటు 12.31శాతానికి పెరిగినట్లు సీఎం పిన్నరయి విజయన్ ఓ ప్రకటనలో తెలిపారు. కేరళల మొత్తం మరణాల సంఖ్య 26,571కి చేరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97,630 యాక్టివ్ కేసులున్నాయని..ఇందులో 10.4శాతం మంది హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు ప్రకటనలో సీఎం తెలిపారు.

ఇక,రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన 93.6శాతం(2.50 కోట్లు) మందికి కనీసం ఒకడోసు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు సీఎం తెలిపారు. 44.6(1.19కోట్లు)శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు.

ALSO READ కాక రేపుతున్న కన్నడ రాజకీయం..సిద్ధరామయ్య-యడియూరప్ప రహస్య భేటీ!

ట్రెండింగ్ వార్తలు