Covid Health Insurance : మళ్లీ కోవిడ్ కలకలం.. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి!

Covid Health Insurance : కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న వేళ మీ హెల్త్ ఇన్యూరెన్స్ పాలసీని ఓ సారి తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

covid health insurance policy coverage things you must check before medical emergency

  • మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు
  • మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయో చెక్ చేసుకోండి
  • కీలక సూచనలు చేస్తున్న నిఫులు

Covid Health Insurance : దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ -19 కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇటీవల మృతిచెందిన ఇద్దరిలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మరో పది మంది వరకు కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించిన వైద్యాధికారులు.. వారికి చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లోనూ కోవిడ్ -19 కేసులు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : RBI Plastic Notes : ఆర్‌బీఐ బిగ్ డెసీషెన్.. పాలిమర్ నోట్లు వచ్చేస్తున్నాయ్..! వీటివల్ల ఉపయోగాలు.. ఏఏ దేశాల్లో వినియోగంలో ఉన్నాయంటే?

కోవిడ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ.. గతంలో లాంటి ఆందోళనకర పరిస్థితులకు అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ టీకాల కారణంగా రోగనిరోధక శక్తి పెరిగి.. వైరస్ సోకినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం చాలా వరకు తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, అనారోగ్యం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఒకసారి సమీక్షించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

చాలామంది కోవిడ్‌కు సంబంధించిన అన్ని వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయని భావిస్తుంటారు. కానీ, వాస్తవానికి పాలసీలోని నిబంధనల ఆధారంగానే కవరేజ్ ఉంటుంది. సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రస్తుతం కోవిడ్-19ను ఇతర వ్యాధుల మాదిరిగానే పరిగణిస్తున్నారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడం, ఐసీయూ ఖర్చులు, వైద్యుల ఫీజులు, అవసరమైన పరీక్షలు వంటి ఖర్చులు సాధారణంగా పాలసీ నిబంధనల మేరకు కవర్ అవుతాయి. అయితే, ఇంట్లోనే చికిత్స పొందే వారికి అన్ని ఖర్చులు తిరిగిరావు. పల్స్ ఆక్సీమీటర్, మాస్కులు, శానిటైజర్లు, విటమిన్ సప్లిమెంట్లు, కొన్ని మందులు వంటి ఖర్చులు డొమిసిలరీ కేర్ (ఇంటి వద్ద చికిత్స) కవరేజ్ ఉంటేనే చెల్లించే అవకాశం ఉంటుంది. అలాగే టెలీ కన్సల్టేషన్, హోమ్ నర్సింగ్ సేవలు కూడా పాలసీలో ఉంటేనే వర్తిస్తాయి.

నగదు రహిత (క్యాష్‌లెస్) చికిత్స కూడా నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. నెట్‌వర్క్‌లో లేని ఆస్పత్రిలో చికిత్స పొందితే ముందుగా బిల్లు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఇటీవలి సంవత్సరాల్లో వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో గతంలో తీసుకున్న ఇన్సూరెన్స్ కవరేజ్ ఇప్పుడు సరిపోకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా అదనపు ఆర్థిక భద్రత పొందవచ్చని సూచిస్తున్నారు. అలాగే పాలసీలో ఉన్న వెయిటింగ్ పీరియడ్, ఎక్స్‌క్లూజన్స్ (వర్తించని చికిత్సలు) గురించి ముందుగానే తెలుసుకోవడం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు వైద్యుల ప్రిస్క్రిప్షన్లు, పరీక్షల నివేదికలు, ఆస్పత్రి బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీలు, ఫార్మసీ బిల్లులను భద్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉద్యోగ సంస్థ అందించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌పైనే ఆధారపడేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం మారినా లేదంటే కోల్పోయినా ఆ పాలసీ వర్తించకపోవచ్చు. కాబట్టి వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకసారి తీసుకుని మర్చిపోయే పత్రం కాదు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యక్తిగత అవసరాలు, పాలసీ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.