COVID 19 Cases: ఒక్కరోజే 5వేల 5వందల కేసులు.. 80శాతం ఒమిక్రాన్!

మంగళవారం(4 జనవరి 2021) ఢిల్లీలో సుమారు 5,500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

short-range Covid transmission

COVID 19 Cases In Delhi: మంగళవారం(4 జనవరి 2021) ఢిల్లీలో సుమారు 5,500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఇన్‌ఫెక్షన్ రేటు 8.37 శాతానికి పెరిగింది. సాయంత్రం 4 గంటలకు ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గడిచిన 24 గంటల్లో 5481కొత్త కేసులు నిర్ధారించబడ్డాయి. అదే సమయంలో, 1575 మంది కోలుకోగా.. ముగ్గురు మరణించారు.

ఢిల్లీలో ఇప్పటివరకు 14లక్షల 63వేల 701 మంది రోగులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 14లక్షల 23వేల 699 మంది కోలుకున్నారు. 25వేల 113 మంది చనిపోయారు. ప్రస్తుతం 14వేల 889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు.

గత కొన్ని రోజుల డేటాను పరిశీలిస్తే..
Jan 03 – 4వేల 99కేసులు
Jan 02- 3వేల 194కేసులు
Jan 01- 2వేల 716కేసులు
Dec 31- వెయ్యి 796కేసులు
Dec 30- 1313కేసులు
డిసెంబర్ 29- 923
డిసెంబర్ 28- 496
డిసెంబర్ 27- 331
డిసెంబర్ 26- 290
డిసెంబర్ 25- 249
డిసెంబర్ 24- 180
డిసెంబర్ 23- 118
డిసెంబర్ 22- 125
డిసెంబర్ 21- 102

ఢిల్లీలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండడం కంగారు పెట్టేస్తోంది. గడిచిన 24 గంటల్లో 8.37 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటి రేటు ఇంకా పెరుగుతూ ఉంది. కోవిడ్ కట్టడికి ఢిల్లీ వ్యాప్తంగా 2992 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. కరోనా కేసులు పెరగడంతో వారాంతపు కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ సహా ఎల్లో అలెర్ట్ ఆంక్షలు అమలు చేస్తుంది అక్కడి ఢిల్లీ ప్రభుత్వం. సినిమా హాళ్లు, జిమ్‌లు మూసివేయబడ్డాయి. నిత్యావసర వస్తువుల దుకాణాలను సరి-బేసి పద్ధతిలో తెరవాలని, మెట్రో, బస్సుల్లో ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతానికి తగ్గించాలని ఆదేశించింది ప్రభుత్వం.