Covid Test Kit : కొవిడ్ హోం టెస్ట్ కిట్లు.. క్షణాల్లో ఫలితాలు.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. RTPCR పరీక్ష సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితులలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల (RATS) విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు.

Covid Test Kit : దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొవిడ్ టెస్టులకు వెళ్లేవారితో కోవిడ్ సెంటర్లు రద్దీగా మారుతున్నాయి. ఆర్టీపీసీఆర్ ఆధారిత పరీక్షకు ఐదు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది.. దాంతో రోగ నిర్ధారణ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు కలిగిన కొవిడ్ బాధితుల్లో హోమ్ టెస్ట్ కిట్‌ల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.  RTPCR టెస్టులతో అధిక సమయం పడుతోందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, ICMR డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ అన్ని ప్రధాన కార్యదర్శులకు లేఖలో తెలిపారు.

RTPCR పరీక్ష సవాళ్లను ఎదుర్కొంటున్న నిర్దిష్ట పరిస్థితులలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల (RATS) విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. ఈ ర్యాపిడ్ టెస్టుల ద్వారా టెస్టులను మరింత పెంచేలా ప్రోత్సాహించాలని అధికారులు సూచనలు చేశారు. రోగలక్షణాలు కలిగిన బాధితులు ఇంట్లోనే స్వయంగా హోం కిట్ల ద్వారా పరీక్ష చేసుకునేలా ప్రోత్సహించవచ్చని చెప్పారు. అయితే ఇప్పటివరకూ 7 హోం టెస్టు కిట్‌లను ఆమోదించినట్టు తెలిపారు.  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదించిన టెస్ట్ కిట్‌లు/ప్రొడక్టులు GeM పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. GeM నుంచి ఈ కొవిడ్ హోం టెస్టు కిట్లను సేకరించవచ్చని లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ హోం టెస్టు కిట్‌లు వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏ కిట్‌లను ICMR ఆమోదించిందంటే?
Mylab Discovery’s Coviself (Pathocatch) COVID-19 OTC యాంటిజెన్ LF డివైజ్, అబాట్ రాపిడ్ Panbio COVID-19 యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ డివైజ్, మెరిల్ డయాగ్నోస్టిక్స్ కోవిఫైండ్ కొవిడ్-19 రాపిడ్ యాంటిజెన్ సెల్ఫ్ టెస్ట్, Angstrom Biotech Angtech COVID-19 హోమ్ టెస్ట్ కిట్, హీల్జెన్ సైంటిఫిక్ లిమిటెడ్ క్లినిటెస్ట్ COVID-19 యాంటిజెన్ సెల్ఫ్ టెస్టు SD బయోసెన్సర్ హెల్త్‌కేర్ ULTRA కోవి-క్యాచ్ SARS-CoV-2 హోమ్ టెస్ట్ Nulife కేర్ AbCheck రాపిడ్ యాంటిజెన్ సెల్ఫ్ టెస్టు కిట్ల ద్వారా పరీక్షించుకోవచ్చు.

ఏ సమయంలో టెస్టు అవసరం :
లండన్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ ఇరేనే పీటర్సన్ ప్రకారం.. కరోనా ఇన్ఫెక్షన్ సోకినప్పటినుంచి రెండు లేదా మూడు రోజుల తర్వాత కరోనా పరీక్షకు సరైన సమయంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి అయ్యే క్రమంలో లక్షణాలు బయటపడటానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. ఉదాహరణకు.. మీరు శుక్రవారం కరోనా వైరస్ ఉన్న వారి పక్కన కూర్చుంటే.. మీరు సోమవారం కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ టెస్టు కిట్‌ రిజల్ట్స్ పాజిటివ్ వస్తే.. వారు మరోసారి అదనంగా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని ICMR వెల్లడించింది. కొవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిన వారు RT-PCR టెస్టును ఎంచుకోవచ్చు.

సెల్ఫ్ టెస్టు కిట్ ఎలా ఉపయోగించాలి?
– టెస్టింగ్ కిట్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. మీ వివరాలను ఇవ్వండి.
– కిట్‌ను ఉపయోగించే ముందు మీ చేతులను శుభ్రపరచుకోండి.
– ఆ కిట్ ఉంచే ప్రదేశాన్ని క్లీన్ చేసుకోండి.
– నింపిన ద్రవాన్ని బయటకు తీసేందుకు ముందుగా ట్యూబ్‌ను నొక్కండి.
– శుభ్రమైన నాజిల్‌ను తెరవండి. మీరు దాన్ని తాకకుండా జాగ్రత్త తీసుకోండి.
– నాసికా స్వాబ్‌ ట్యూబ్‌ను రెండు నాసికా రంధ్రాలలో ఒకదాని తరువాత ఒకటి 2-4 సెంటీమీటర్ల వరకు చొప్పించండి.
– ప్రతి నాసికా రంధ్రంలో ఐదుసార్లు స్వాబ్ సేకరించండి.
– ముందుగా నింపిన ట్యూబ్‌లో స్వాబ్‌లను ముంచండి.
– నాజిల్ క్యాప్‌తో ట్యూబ్‌ను కవర్ చేయండి.

Read Also : AP Covid : ఫ్లాష్..ఫ్లాష్..ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ట్రెండింగ్ వార్తలు