COVID-19: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. నిన్న 10,649 కేసులు నమోదు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న దేశ వ్యాప్తంగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 10,677 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 96,442 మంది చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,37,44,301కి చేరిందని వివరించింది.

COVID-19

COVID-19: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న దేశ వ్యాప్తంగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 10,677 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 96,442 మంది చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,37,44,301కి చేరిందని వివరించింది.

కరోనా వల్ల దేశంలో మొత్తం 5,27,452 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.59 శాతం ఉన్నట్లు పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.62 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో 88.35 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది.

నిన్న 4,07,096 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 210.58 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను వాడారని చెప్పింది. వాటిలో రెండో డోసులు 94.05 కోట్లు, బూస్టర్ డోసులు 14.30 కోట్లు ఉన్నాయని పేర్కొంది. నిన్న దేశంలో 27,17,979 డోసులు వినియోగించినట్లు తెలిపింది.

Read Also : Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..