×
Ad

Covishield వ్యాక్సిన్ డోసుల వ్యవధి తగ్గింపు!

 పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ " కొవిషీల్డ్" రెండు డోసుల మధ్య వ్యవధిని ప్రస్తుతమున్న 84 రోజుల నుంచి తగ్గించే ప్రతిపాదనపై కేంద్రం

Vaccine (1)

Covishield  పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ” కొవిషీల్డ్” రెండు డోసుల మధ్య వ్యవధిని ప్రస్తుతమున్న 84 రోజుల నుంచి తగ్గించే ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని.. NTAGI(National Technical Advisory Group on Immunisation)కమిటీ త్వరలో దీనిపై చర్చించనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆక్స్​ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.

కాగా,ఈ ఏడాది జనవరిలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలినాళ్లలో కోవిషీల్డ్ రెండు డోసు మధ్య ఉన్న 6-8 వారాల వ్యవధిని.. మే నెలలో 12-16 వారాలకు పెంచిన విషయం తెలిసిందే. డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల వ్యాక్సిన్‌తో మెరుగైన ఫలితాలు లభిస్తాయని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ నిపుణుల బృందం చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజా ప్రతిపాదనకు నిపుణులు సానుకూలత వ్యక్తం చేస్తే.. డోసుల మధ్య వ్యవధి తగ్గనుంది.