Cow belongs to Hindus and ox belongs to Muslims? asks Farooq Abdullah over Pathaan row
Pathaan Row: పఠాన్ సినిమాలోని బేషరం రంగ్ పాట విడుదలైన అనంతరం మొదలైన కాంట్రవర్సీపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ ఫారుఖ్ అబ్దుల్లా తనదైన శైలిలో స్పందించారు. రంగులను బట్టి మతాన్ని చూడటమేంటని, అసలు రంగులకు మతాన్ని అంటగట్టడమేంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొంత మంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ఇలాంటి చీలికలకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి దేశ ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆవుకు ఒక మతాన్ని ఎద్దుకు ఒక మతాన్ని అంటగట్టడం ఏంటని ఫారూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు.
Siddique Kappan: ఎట్టకేలకు సిద్ధిఖీ కప్పన్‌కు బెయిల్.. రెండేళ్లు జైలులోనే మగ్గిన కేరళ జర్నలిస్ట్
శుక్రవారం ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయం బట్టలు ధరించడం అంశంపై ఇంత పెద్ద దుమారం లేవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే కాషాయం అంటే హిందువులది, ఆకుపచ్చ అంటే ముస్లింలదా? ఏంటిదంతా..? ఆవు అంటే హిందువులది కాబట్టి ఎద్దు ముస్లింలకు చెందుతుందా? రంగులను బట్టి మతాలను చెప్పడం ఏంటి? అసలు రంగులకు మతాలను అంటగట్టడం ఏంటి? దేశంలో విభజన రాజకీయాలు కొనసాగుతున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ఇలాంటి చీలికలకు ప్రయత్నిస్తున్నారు. వారి నుంచి దేశ ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.