Siddique Kappan: ఎట్టకేలకు సిద్ధిఖీ కప్పన్‌కు బెయిల్.. రెండేళ్లు జైలులోనే మగ్గిన కేరళ జర్నలిస్ట్
యూపీలోని హత్రాస్‌లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ ఘటన తర్వాతన అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులకు తెలియకుండా బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు దొంగచాటుగా తీసుకువచ్చి, రహస్య ప్రదేశంలో తగలబెట్టారు.

Kerala Journalist Siddique Kappan Gets Bail After 2 Years In UP Jail
Siddique Kappan: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‌లో ఒక దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై రిపోర్టింగ్ చేయడానికి వెళ్లి, ఉగ్ర కార్యకలాపాల ఆరోపణలతో జైలు పాలైన కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అతడిపై ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి రెండేళ్ల క్రితం జైలుకు పంపారు. అయితే అనేకసార్లు అతడు బెయిల్‌కు ప్రయత్నించినప్పటికీ అది లభించలేదు. తాజాగా బెయిల్ మంజూరు చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ముడు రోజుల్లోపు ట్రయల్ కోర్టులో హాజరుపర్చి బెయిల్ మీద విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
చాలా కాలంగా కప్పన్ అనేక బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నటప్పటికీ.. కోర్టు తోసిపుచ్చింది. అయితే తాజాగా అతడి అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఈ విషయమై వివరణ ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలో మత విధ్వేషాలు, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కుట్రలో భాగంగా హత్రాస్‌కు కప్పన్ వచ్చాడని యూపీ ప్రభుత్వం తెలిపింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో కప్పన్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణను పరిశీలించిన అనంతరం, కప్పన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
Jagdeep Dhankhar: సోనియా వ్యాఖ్యలపై స్పందించడం నా బాధ్యత.. వివరణ ఇచ్చిన ఉపరాష్ట్రపతి ధన్కడ్
రెండేళ్ల క్రితం.. యూపీలోని హత్రాస్‌లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ ఘటన తర్వాతన అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులకు తెలియకుండా బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు దొంగచాటుగా తీసుకువచ్చి, రహస్య ప్రదేశంలో తగలబెట్టారు. అప్పట్లో ఇది దేశాన్ని కుదిపివేసింది. ఆ సమయంలో దీనిపై రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన కప్పన్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నారంటూ ఉపా కింద కేసు నమోదు చేశారు.