కర్ణాటకలో గో వధ నిషేధం…త్వరలో అమల్లోకి

Cow Slaughter Ban will be a reality in Karnataka కర్ణాటకలో “గో వధ నిషేధం” అతి త్వరలోనే వాస్తవరూపం దాల్చబోతోందని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గోవధను నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు.



కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కాటల్ బిల్లు కేబినెట్ లో ఆమోదించి,రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి ప్రభు చవాన్ ని కోరినట్లు సీటీ రవి తెలిపారు. ఇక ‘లవ్‌ జిహాద్’పై చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు సీటీ రవి.



లవ్ జీహాద్ అంశంపై బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ రాజస్తాన్ సీఎం చేసిన ఓ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ… దేశాన్ని విభజించేందుకు మరియు మత సామరస్యాన్ని దెబ్బతీయడం కాంగ్రెస్ పార్టీ సొంత డొమైన్. వివాహమనదేవి వ్యక్తిగత స్వేచ్చేనని,దీన్ని ఎవ్వరూ విబేధించడం లేదని,కానీ ఎలప్పుడూ సల్మాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సునీతా ఎందుకు షబ్నంగా మారిపోవాలి అని సీటీ రవి ప్రశ్నించారు. ఒకవేళ ఇది నిజమైన ప్రేమ అయితే,ఎందుకు ఓ హిందువు బలవంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతుంది అని సిటీ రవి ప్రశ్నించారు. ‌