Rains In Maharashtra : మహారాష్ట్రలో వర్షం బీభత్సం..వరదల్లో కొట్టుకుపోయిన ఆవులు

మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు మూగజీవాలు బలైపోతున్నాయి. వాగు దాటేందుకు యత్నించిన ఆవుల మంద... నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

Cows washed away in floods : మహారాష్ట్రలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బుల్దానా జిల్లాలో వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు మూగజీవాలు బలైపోతున్నాయి. వాగు దాటేందుకు యత్నించిన ఆవుల మంద… నీటి ప్రవాహంలో గల్లంతైంది. కొన్ని ఆవులు క్షేమంగానే ఒడ్డుకు చేరుకోగా మరికొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. స్థానికులు చూస్తున్నా వాటిని కాపాడలేని పరిస్థితి.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. జనజీవనం అతలాకుతలమైంది.

వరదల్లో పశువులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాలకు పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు వాపోయారు.

ట్రెండింగ్ వార్తలు