Budget 2022: బడ్జెట్… కార్పొరేట్ సంస్థలకు మాత్రమే సంతృప్తిగా ఉంది – సీపీఐ జాతీయ కార్యదర్శి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2022 బడ్జెట్ పై రాజకీయ ప్రముఖులు పలు విమర్శలు చేస్తున్నారు.

Budget 2022

Budget 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2022 బడ్జెట్ పై రాజకీయ ప్రముఖులు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీపీఐ కార్యదర్శి డా. కే నారాయణ ప్రస్తుత బడ్జెట్‌ కార్పొరేట్‌ సంస్థలను సంతృప్తి పరిచేదిగాను, మధ్యతరగతి ప్రజలకు అసంతృప్తి కలిగే విధంగా ఉందని అన్నారు.

‘ఆర్థిక మంత్రి నర్మగర్భంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎలాంటి ప్రాముఖ్యత లేకున్నా ప్రక్కనున్న ప్రధానమంత్రి గొప్పగా ఫీలవుతున్నారు. కోవిడ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్య, వైద్యరంగానికి ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది.

‘ఉద్యోగస్థుల జీతాలపై పన్నులలో స్లాబ్‌లో ఏర్పాటు చేస్తారనుకున్నవారిని మోసం చేశారు. 20 వేల రూపాయల జీతం దాటిన ఉద్యోగి కూడా 5 శాతం పన్ను కట్టాల్సి వస్తుంది’

Read Also : నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్ : ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు

‘నరేంద్రమోదీ భారత దేశ ప్రధానిగా వ్యవహరించకుండా గుజరాత్‌ను మినీ భారత్‌గా మార్చారు. అక్కడే ఎక్కువ నిధులు కేటాయిస్తూ ఖర్చు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే అక్కడ కూడా కొంత కేటాయింపులు చేశారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కే నారాయణ అన్నారు.