LIC Employees Unions : నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్ : ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు

వ్యవసాయ రంగంలో ఎమ్ ఎస్ పీ వంటి వాటిపై స్పష్టత లేదని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. రైల్వే ప్రాజెక్టు కొత్తవి లేవు, పాత వాటికి నిధులు లేవన్నారు.

LIC Employees Unions : నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్ : ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు

Lic

union budget-2022 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు స్పందించాయి. ఎల్ఐసీని ప్రైవేట్ పరం చేసే కుట్రలో భాగంగానే పబ్లిక్ ఇష్యూలోకి తీసుకువచ్చారని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని విమర్శించాయి. ఈ బడ్జెట్ తో ఎవరికి ఉపయోగం లేదని ఎద్దేవా చేశాయి. వ్యవసాయ రంగం 3 శాతం వృద్ధి అన్నారు.. కానీ, వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవని విమర్శించాయి.

వ్యవసాయ రంగంలో ఎమ్ ఎస్ పీ వంటి వాటిపై స్పష్టత లేదని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. రైల్వే ప్రాజెక్టు కొత్తవి లేవు, పాత వాటికి నిధులు లేవన్నారు. ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు ఎవరికి ఆమోద యోగ్యంగా లేదని చెప్పారు. ఒకప్పుడు బడ్జెట్ అంటే దేశ ప్రజలకు, ఉద్యోగులకు ఆసక్తికరమైనదిగా ఉండేదని తెలిపారు.

Sajjala Ramakrishnareddy : కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదు : సజ్జల

ఉద్యోగులకు ఇంకమ్ టాక్స్ స్లాబ్ లో ఎలాంటి మార్పు చేయకపోవడం నిరాశ కలిగించిందన్నారు. ఈ బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్ ఐ సీ ఆస్తులపై కేంద్రం కన్నేసిందన్నారు. రూ.20 లక్షల కోట్ల విలువైన ఎల్ఐసీ ఆస్తులను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఇన్సూరెన్స్ ను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో ఇన్సూరెన్స్ ను అందని ద్రాక్షగా చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు.