Abishek
Abhishek Banerjee వెస్ట్ బెంగాల్ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల(ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్‌హటా )కు గత నెల 30న ఉప ఎన్నికలు జరగ్గా..వాటి ఫలితాలు ఇవాళ విడుదల్యయాయి. మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఎంసీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు.
అయితే ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ,మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బీజేపీ ఓటమిపై తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. ఓ ట్వీట్ లో అభిషేక్ బెనర్జీ…బీజేపీకి దీపావళి శుభాకాంక్షలు. నిజంగా ఇది టపాసులు లేని దీపావళి అని సెటైర్ వేశారు.
బెంగాల్‌లోని నాలుగు ఉప ఎన్నిక స్థానాల్లో ఏకంగా 75 శాతం ఓట్లను టీఎంసీ సాధించింది. ఇక, తాజా ఉప ఎన్నికల్లో దిన్హాటా, శాంతిపూర్ స్థానాలను బీజేపీ చేతి నుంచి లాగేసుకున్న టీఎంసీ మొత్తం స్థానాలను 213కు పెంచుకుంది.
ALSO READ Ration Rice : ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత