Kozhikode plane Crash సహాయం చేసిన 26 మందికి కరోనా

  • Publish Date - August 21, 2020 / 07:31 AM IST

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టిన 26 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో అధికారులున్నారు. వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మలప్పురం వైద్యాధికారి డాక్టర్ కె.సకీనా వెల్లడించారు.



మలప్పురం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో కోజికోడ్ ఎయిర్ పోర్టు ఉంది. ఆగస్టు 07వ తేదీన జరిగన ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహాయపడ్డారు. సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె గోపాలకృష్ణన్, పోలీసు సూపరింటెండెంట్ అబ్దుల్ కరీం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో సహా 26 మంది అధికారులకు పరీక్షలు చేయడం జరిగిందన్నారు.

కేర‌ళ‌లోని కోజికోడ్‌లో విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లతో సహా 19 మంది మృతి చెందారు. మొత్తం విమానంలో 190 మంది ప్రయాణీకులున్నారు. 2020, ఆగస్టు 7 శుక్రవారం రాత్రి కోజికోడ్‌ విమనాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి రెండు ముక్కలైంది.



అనేక మంది గాయపడ్డారు. విమానాశ్రయ ప్రాంతం వద్ద నివాసం ఉంటున్న స్థానికులు సాహసం చేసి ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు పలువురు. సీఎం పినరయ్ విజయన్ వీరిని ప్రశంసించారు.