Cristiano Ronaldo: యువతకు ప్రేరణగా ఉండాలని రొనాల్డ్ విగ్రహం

పోర్చుగీస్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో విగ్రహాన్ని గోవాలోని పనాజీలో ఏర్పాటు చేశారు. యువతకు ప్రేరణ కల్పించి ఫుట్ బాల్ స్థాయిని రాష్ట్రంలో, దేశంలోనూ ఇంకా పెంచేందుకే...

Cristiano Ronaldo: పోర్చుగీస్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో విగ్రహాన్ని గోవాలోని పనాజీలో ఏర్పాటు చేశారు. యువతకు ప్రేరణ కల్పించి ఫుట్ బాల్ స్థాయిని రాష్ట్రంలో, దేశంలోనూ ఇంకా పెంచేందుకే ఇలా చేశామని అంటున్నారు వ్యవస్థాపకులు. 410కేజీల విగ్రహం క్రీడల్లో తమ కలను నెరవేర్చుకోవాలనే యంగర్ జనరేషన్ కు ప్రేరణగా ఉంటుందని అంటున్నారు.

ఇండియాలో క్రిస్టియన్ రొనాల్డ్ విగ్రహం ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి. కేవలం యువతకు ప్రేరణ కల్పించేందుకే ఏర్పాటు చేశాం. ఫుట్ బాల్ ను వేరే లెవల్ కు తీసుకెళ్లాలనుకునే యంగ్ బాయ్స్, గర్ల్స్ .. సెల్ఫీలు తీసుకుని ఇన్ స్పిరేషన్ పొందాలి. గవర్నమెంట్, మునిసిపాలిటీ, పంచాయతీ పనేంటంటే.. మంచి వసతులు కల్పించడం, ఫుట్ బాల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయడం వంటివి చూసుకోవాలి’ అని గోవా మంత్రి మైకేల్ లోబో అన్నారు.

మనకు కోచ్ ల అవసరం ఎంతైనా ఉంది. ఫుట్‌బాల్ మాజీ ప్లేయర్లను కోచ్ లుగా అపాయింట్ చేయాలి. ఫుట్‌బాల్ లో ఇండియా గర్వించే స్థాయికి తీసుకెళ్లాలి. ఈ ఆటలో ప్రపంచవ్యాప్తంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం. అని యువత క్రీడల్లో ఆసక్తి చూపించాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి : వివాహేతరం సంబంధం పంచాయితీ-మామను చంపిన అల్లుడు

ట్రెండింగ్ వార్తలు