Hyderabad : వివాహేతరం సంబంధం పంచాయితీ-మామను చంపిన అల్లుడు

వివాహేతర సంబంధం విషయంలో మధ్యవర్తిత్వం చేస్తున్న వ్యక్తిని అతని అల్లుడు హత్య చేసిన ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది.

Hyderabad : వివాహేతరం సంబంధం పంచాయితీ-మామను చంపిన అల్లుడు

Man killed his Uncle

Updated On : December 29, 2021 / 11:28 AM IST

Hyderabad :   వివాహేతర సంబంధం విషయంలో మధ్యవర్తిత్వం చేస్తున్న వ్యక్తిని అతని అల్లుడు హత్య చేసిన ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట సంజయ గాంధీ‌నగర్‌కు చెందిన రాజమౌళి (50) గత రాత్రి పాపి రెడ్డి నగర్ లో నివాసముండే తన అల్లుడు బాలకృష్ణ (23) ఇంటికి వెళ్ళాడు. బాలకృష్ణ తండ్రి అక్రమ సంబంధం విషయమై చర్చిస్తుండగా మాట మాట పెరిగి ఘర్షణ చెలరేగింది. దాంతో కోపోద్రిక్తుడైన బాలకృష్ణ..తన మామ నరసింహ మెడపై కత్తితో పొడిచాడు.
Also Read : Rudram : భారత్ అమ్ముల పొదిలో యాంటీ రేడియేషన్ మిస్సైల్ “రుద్రం”
అనంతరం కుటుంబ సభ్యులు చింతల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బాలకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.