Crude Oil Prices
Crude oil prices down : అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. అయితే పెట్రోల్ ధరలు కూడా దిగొస్తాయా? అంటే ఆయిల్ కంపెనీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గత 10 నుంచి 14 రోజుల్లో ముడి చమురు ధరలు 10శాతం తగ్గాయి. ఈ తగ్గిన ధరలను ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు బదలాయించేందుకు నిర్ణయిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిపోతాయి.
రెండు వారాల క్రితం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్లు ఉండగా.. ఇప్పుడు 63.98డాలర్లకు చేరింది. కొన్నిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇందన ధరలను మార్చకుండా స్థిరంగా ఉంచాయి ఆయిల్ కంపెనీలు.
యూఎస్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 60.94 డాలర్లకు తగ్గింది. పెట్రోల్ రేట్లు సెంచరీకి చేరువ కావడానికి అంతర్జాతీయంగా ధరలు పెరగడమే కారణమని అంటున్నాయి ఆయిల్ కంపెనీలు. ధరలు తగ్గినా కూడా వినియోగదారులకు తగ్గించడం లేదు. అదేగానీ చేస్తే.. పెట్రోల్ రేట్లు కూడా దిగొచ్చే అవకాశం లేకపోలేదు.