Bengal Gram : రబీలో శనగసాగు…విత్తన రకాలు

తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమి నాగలితో ఒకసారి ,గోర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదను చేయాలి.

Bengal Gram

Bengal Gram : రబీ కాలం లో పండించే ఆపరాలలో శనగ ముఖ్యమైనది .శీతా కాలంలో కేవలం మంచు తో పెరిగె శనగ పంట మన రాష్టంలో పలు ప్రాంతాలలో అధిక దిగుబడి నివ్వడం వల్ల ఈ పంట విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ పంట నల్ల రేగడి భూముల్లో సాగుచేయబడుతుంది. సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలంగా ఉంటాయి.

తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమి నాగలితో ఒకసారి ,గోర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదను చేయాలి. కిలో విత్తనానికి 4గ్రా ట్రెకోడేర్మా విరిడేను వాడితే మంచి ఫలిత ముంటుంది. ర్తేజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తితే ర్తేజోబియం లేని భూముల్లో 20-30 శాతం అధిక దిగుబడి పొందవచ్చు. 8 కిలోల విత్తినానికి ఒక ర్తేజోబియం 200గ్రా వాడాలి. 30×10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.

సాగుకు ఎంపిక చేసుకోవాల్సిన రకాలు;

క్రాంతి (ఐ.సి.సి.సి.-37): పంటకాలం 100-105 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు. గుబురుగా పెరుగుతుంది. గింజలు మధ్యస్థ లావుగా ఉంటూ ఎండు తెగులును తట్టుకో గల దేశీయ రకం.

శ్వేతా (ఐ.సి.సి.వి.-2): పంటకాలం 80-85 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వింటళ్ళు. త్వరగా కాపుకు వచ్చే రకం .ఎండు తెగులును తట్టుకొనే కాబూలి రకం. ఆలస్యంగా వేసుకోవాడానికి అనుకూలం

అన్నెగిరి: పంటకాలం 100-110 రోజులు. దిగుబడి ఎకరాకు 7-9 క్వింటళ్ళు. మొక్క గుబురుగా పెరిగి ,కొమ్మలు ఎక్కువగా వేస్తుంది. గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా ఉంటాయి.

జ్యోతి : పంటకాలం 100-110 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వింటళ్ళు, మొక్క క్రింద నుండి గుబురుగా కొమ్మలు వేస్తుంది. గింజలు గరుకుగా , మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి.

ఐ.సి.సి.వి-10 ; పంటకాలం 100-110 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు. మొక్క నిటారుగా పెరిగి బాగా కొమ్మలు వేస్తుంది. ఎండు తెగులును బాగా తట్టుకొంతుంది. వేరు కుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకొంతుంది. అక్టోబర్ లో వేసుకోవాడానికి అనుకూలంగా చెప్పవచ్చు.

కె.ఎ.కె.-2: పంటకాలం 95-100 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు. లావు గింజ కల కాబూలీ రకం .మెక్క ఎత్తుగా పెరుగుతుంది .

పూలే,జి -95311: పంటకాలం 95-100 రోజులు. దిగుబడి ఎకరాకు 7-8 క్వింటళ్ళు. కాబూలీ రకం. గింజలు లావుగా ఉంటాయి.

జె.జి ,11: పంటకాలం 100-110 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు. ఎండు తెగులను తట్టుకంతుంది. లావుపాటి గింజలు గల దేశీయ రకము .

లామ్ శనగ : పంటకాలం 90-95 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు. లావు గింజ కల కాబూలీ రకం. మెక్క ఎత్తుగా పెరుగుతుంది .

ట్రెండింగ్ వార్తలు