Tamil Nadu BJP President
Tamil Nadu BJP President : తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలైపై ఆ రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. నార్త్ ఇండియన్స్‌పై డీఎంకే విద్వేషపూరిత ప్రచారం చేస్తోందని అన్నామలై ఆరోపించారు. ఉత్తరాధి ప్రజలకు వ్యతిరేకంగా డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్‌సహా ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల తాలూకూ వీడియోను అన్నామలై తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్రమంలో అన్నామలై వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంటూ.. హింసను ప్రేరేపించడం, గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు.
Tamilnadu: స్టాలిన్ కారుకు వేలాడుతూ వెళ్లిన చెన్నై మేయర్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
పోలీసుల కేసు నమోదు తరువాత అన్నామలై మాట్లాడుతూ.. ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకంగా ఏడు దశాబ్దాలుగా డీఎంకే చేస్తున్న ప్రచారాన్ని బయటపెట్టినందుకు నాపై తప్పుడు కేసులు పెట్టారని, 24గంటల్లో దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి అంటూ డీఎంకే ప్రభుత్వానికి అన్నామలై సవాల్ విరాడు. తప్పుడు కేసులతో ప్రజాస్వామ్య గొంతును అణచివేయాలని డీఎంకే ప్రభుత్వం భావిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే అన్నామలై పై కేసు నమోదు చేయడం పట్ల బీజేపీ నేత ఖష్బు సుందర్ మండిపడ్డారు. సుందర్ ట్విటర్ లో స్పందించారు. అన్నామలైపై నమోదైన కేసులు డీఎంకే ప్రభుత్వ క్రూరమైన స్వభావాన్ని చూపుతున్నాయని ఆరోపించారు. గత 60ఏళ్లుగా రాజకీయాల పేరుతో ఏం చేస్తున్నారో జాతికి తెలియజేసే అవకాశం ఇదొకటి అంటూ ఆమె తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.
Tamil Nadu Politics: జయలలిత వారసుడు పళనిస్వామే..! సుప్రీంకోర్టులో పన్నీర్ సెల్వంకు ఎదురుదెబ్బ..
ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందిన విషయం విధితమే. అయితే, ఈ వార్తలు ఫేక్ అంటూ తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. వలస కార్మికులపై ఎలాంటి దాడులు జరగలేదని , తప్పుడు వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నారని సీఎం స్టాలిన్, పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఫేక్ వదంతులను ప్రచారం చేయడం మానుకోవాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.