Cyclone Biparjoy: తీరాన్ని తాకిన అత్యంత తీవ్ర బిపోర్ జాయ్ తుపాను.. భారీ వర్షాల బీభత్సం.. లక్షమంది తరలింపు

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ తీరాన్ని తాకుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

Cyclone Biparjoy

Cyclone Biparjoy – Gujarat: అత్యంత తీవ్ర బిపోర్‌జాయ్ తుపాను గుజరాత్ తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. గుజరాత్ లో భారీ వర్షాలు (Rains), ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ఇవాళ అర్ధరాత్రిలోపు  తీరాన్ని దాటనుంది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ తీరాన్ని తాకుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తుపాన్ నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా/తగ్గించేందుకు ప్రభుత్వం సహాయక బృందాలను సిద్ధంగా ఉంచింది. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సహాయక చర్యల కోసం 15 షిప్స్, 7 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. నేవీ, ఆర్మీ సిబ్బంది అందుబాటులో ఉన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తుపాను వేళ అప్రమత్తమైంది. తుపాన్ ఇవాళ ఉదయమే పాకిస్థాన్ తీరాన్ని తాకింది. నష్టం అంచనాలకు మించి ఉండొచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Biparjoy sattilite Pics: ట్విట్టర్‌లో వెలుగుచూసిన బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత శాటిలైట్ చిత్రాలు

ట్రెండింగ్ వార్తలు