Cyclone Tauktae : తౌటే తుఫాన్..రాష్ట్రాలు అల్లకల్లోలం

తౌటే తుపాన్ కు అనేక రాష్ట్రాలు అతలాకుతలమైతున్నాయి. కర్ణాటకలోని ఆరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Cyclone (1)

IMD Warning : తౌటే తుపాన్ కు అనేక రాష్ట్రాలు అతలాకుతలమైతున్నాయి. కర్ణాటకలోని ఆరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 73 గ్రామాలపై వర్షం ప్రభావం ఉందని కర్ణాటక విపత్తు నిర్వాహణ బృందం వెల్లడించింది.

ఈ తుపాన్ కారణంగా గోవా చిగురుటాకులా వణుకుతోంది. బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. తుఫాను తీరానికి మ‌రింత చేరువైతే ప‌రిస్థితి ఇంకా బీభ‌త్సంగా మారే అవ‌కాశం ఉన్న‌ద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. గోవా తీరంలో వాతావ‌ర‌ణం ఒక్కసారిగా మారిపోయింది.

కేరళలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురంతో సహా..అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అలల ఉధృతికి, వర్షాల తీవ్రతకు తీర ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2021, మే 17వ తేదీ సోమవారం ఉదయం గుజరాత్ తీరాన్ని తీకుతుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖాధికారులు. ఈ సమయంలో 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సహాయక చర్యల కోసం 79 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

అలాగే..ఆర్మీ, నేవీ, తీర ప్రాంతాల రక్షణ సిబ్బంది రెడీగా మోహరించాయి. పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వాహణ కమిటీ సమావేశమైంది. ప్రాణ, ఆస్థి నష్టాలను వీలైంతనగా తగ్గించేందుకు..అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది.

Read More : Cyclone Tauktae : హైదరాబాద్ లో వర్షం..కూలిన విద్యుత్ స్థంభాలు