Cyclone Tej: తేజ్ తుపాను ప్రభావం గుజరాత్‌పై ఉండదా? ఐఎండీ కీలక ప్రకటన

తేజ్ తుపాను ఆదివారం తీవ్ర తుపానుగా మారి ఒమన్ దక్షిణ తీరం, దానికి ఆనుకుని ఉండే యెమెన్‌ ప్రాంతాల వైపునకు కదులుతుందని ఐఎండీ తెలిపింది. 

Cyclone Tej

Gujarat: తేజ్ తుపాను నైరుతి అరేబియా మహా సముద్రంలోకి కదులుతోందని, దీని ప్రభావం గుజరాత్‌పై ఉండబోదని అధికారులు చెప్పారు. ఈ తుపాను ఒమన్‌తో పాటు, ఆ దేశ తీరాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ తీరాల దిశగా కదులుతుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

తేజ్ తుపాను ఆదివారం తీవ్ర తుపానుగా మారి ఒమన్ దక్షిణ తీరం, దానికి ఆనుకుని ఉండే యెమెన్‌ ప్రాంతాల వైపునకు కదులుతుందని ఐఎండీ తెలిపింది. అక్టోబరు 22 సాయంత్రానికి తేజ్.. తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అహ్మదాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ మనోరమా మొహంతి వివరించారు.

గుజరాత్‌లో ఏడు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని తెలిపారు. గుజరాత్ విపత్తు నిర్వహణ సహాయ కమిషనర్ అలోక్ కుమార్ పాండే మాట్లాడుతూ… ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. తేజ్ తుపాను వల్ల గుజరాత్‌కు ఎటువంటి ప్రమాదమూ లేదని అన్నారు.

గుజరాత్ ను గతంలో పలు తుపానులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. తేజ్ తుపాను కదులుతుండడంతో దాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అది గుజరాత్ ను తాకదని వాతావరణ శాఖ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Broccoli Farming : శీతాకాలంలో బ్రోకోలి సాగు… అధిక దిగుబడులకోసం మేలైన యాజమాన్యం