ప్రముఖ బౌద్ధ గురువు దలైలామ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. హెల్త్ కండీషన్ బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని దలైలామా అధికారి ప్రతినిధి తెన్ జిన్ తక్లా వెల్లడించారు. 83 సంవత్సరాలున్న దలైలామ ఓ కాన్ఫరెన్స్ నిమిత్తం ఢిల్లీకి వచ్చారు. ఏప్రిల్ 08వ తేదీ సోమవారం ధర్మశాలకు వెళ్లిన ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు.
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ
ఆయన్ను పరిక్షీంచిన వైద్యులు ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించారు. చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంటారని తెన్‌జిన్ వెల్లడించారు. 1959లో టిబెట్ నుండి దలైలామ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. తన వారసుడు భారతీయుడే అవుతాడని ఇటీవలే ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై చైనా గుర్రుగా ఉంది. 1959లో తాను ఇండియాకు వచ్చినట్లు..అప్పటి నుంచి ప్రపంచదేశాల మద్దతుతో టిబెట్ కోసం పోరాడుతూనే ఉన్నానని దలైలామా తెలిపారు.
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు