Dalit panchayat chief : ముందు మనిషి.. ఆ తర్వాతే కులాలు.. ఏమైనా.. సాటి మనిషిపై వివక్షత చూపడం తగదు.. అందులోనూ కులం పేరిట అవమానించడం సరైనది కాదు.. షెడ్యూల్ కులానికి చెందిన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్‌ను నేలపై కూర్చోబెట్టిన వైనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
దీనికి సంబంధించి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాటి మహిళపై కులం పేరుతో వివక్ష చూపినందుకు కడలూర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి తొలగించారు. గత జనవరిలో Therku Thittai గ్రామ పంచాయతీకి Rajeshwari Saravana Kumar ప్రెసిడెంట్ గా గెలిచారు. ఆమె షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ.. పంచాయతీ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఆమెను నేలపై కూర్చోమంటూ అవమానించారు.
ఈ సమావేశంలో మిగిలినవారంతా కూర్చోలో కూర్చొని ఉంటే.. దళిత వర్గానికి చెందిన మహిళ అయిన రాజేశ్వరిని నేలపై కూర్చొబెట్టారు. ఈ చర్యకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి.
పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ మోహన్ రాజుపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కులం కారణంగా ఉపాధ్యక్షుడు తనను నేలపై కూర్చోబెట్టారని రాజేశ్వరి మీడియా ముందు వాపోయింది. జెండా ఎగురవేసేందుకు కూడా తనను అనుమతించరని చెప్పింది. ప్రెసిడెంట్ గా ఎన్నికైన అప్పటినుంచి ఏడాది కాలంగా పెద్దలు చెప్పినట్లుగానే చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.