Tamil Nadu : 200 ఏళ్లనాటి గుడిలోకి 80 ఏళ్ల తరువాత అడుగుపెట్టిన దళితులు ..

200 ఏళ్లనాటి గుడిలోకి 80 ఏళ్ల తరువాత అడుగుపెట్టారు దళితులు ..ముత్తు మరియమ్మన్‌ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పరవశించిపోయారు.

Tamil Nadu : దేవుడికి కులాలు,మతాల తేడా ఉంటుందా? అగ్రవర్ణాలకు ఒకలా అణగారిన వర్గాలను మరొకలా చూస్తాడా దేవుడు? భగవంతుడి దృష్టిలో మనుషులు అంతా ఒక్కటేనని పురాణాలు చెబుతున్నాయి. అయినా ఈ కంప్యూటర్ కాలంలో కూడా అణగారిన వర్గాలకు ఆలయ ప్రవేశమే లేని పరిస్థితులు ఉన్నాయంటే సిగ్గు పడాల్సిన విషయం. అటువంటి పరిస్థితుల్లో భగవంతుడికి చూడాలని ఆశపడిన అణగారిన వర్గాలకు వరంలా మారింది ఆ జిల్లా కలెక్టర్..ఎండోమెంట్ బోర్డు అధికారులు  తీసుకున్న నిర్ణయం.

తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో200 ఏళ్ల చరిత్ర కలిగిన ముత్తు మరియమ్మన్‌ దేవాలయంలోకి కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో 80 ఏళ్ల తరువాత అడుగు పెట్టారు దళితులు. తురువన్నమలై జిల్లాలోని తండరమ్‌పట్టు గ్రామంలో ముత్తు మరియమ్మన్‌ అనే 200 ఏళ్ల చరిత్ర కలినిగి పురాతన ఆలయం ఉంది. ఈ దేవాలయం ఎండోమెంట్‌ బోర్డు ఆధీనంలో ఉంది. ముత్తు మరియమ్మన్‌ దేవాలయంలో పొంగల్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో అమ్మను దర్శించుకుని కళ్లారా చూడాలని తండరమ్ పట్టు గ్రామానికి చెందిన దళితులు ఆశపడ్డారు.

దళితులు అనే కారణంతో తమకు దేవాలయంలోకి రానివ్వటంలేదని దయచేసి మాకు ఆలయం ప్రవేశం కల్పించాలని అమ్మను చూడాలనే ఆశను నెరవేర్చాలని గ్రామానికి చెందిన 500 కుటుంబాల దళితులు ఆ జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. గతంలో ఎన్నిసార్లు గ్రామ పెద్దలను బతిమాలుకున్నా దళితులను ముత్తు మరియమ్మన్ దేవాలయంలోకి అడుగు పెట్టనివ్వలేదు. వారు నిరాకరించడంతో ఎండోమెంట్‌ అధికారులను సంప్రదించారు. అధికారులు అంగీకరించారు. కానీ అధికారుల అంగీకారంతో తమకు పనిలేదని..ఇది మా గ్రామం కట్టుబాటు అని దళితులు ఆలయంలోకి ప్రవేశిస్తే ఆలయం అపవిత్రం అయిపోతుందంటూ కొందరు గ్రామ పెద్దలు వ్యతిరేకించారు.

దీంతో కలెక్టర్ పోలీసుల భద్రతతో అధికారులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. 300 మంది దళితులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మను చూసి పరశించిపోయారు. అమ్మకు ప్రత్యేక పూజలు చేసారు. కలెక్టర్‌ పీ మురుగేశ్ జి్లా ఎస్పీ డాక్టర్‌ కార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తరతరాలుగా గ్రామంలోనే ఉన్నా అమ్మనుదర్శించుకునే భాగ్యం కల్పించారంటూ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు