ఆసియాలోనే పరిశుభ్రమైన నది.. మన ఇండియాలోనే ఉంది.. చూస్తే వావ్ అనాల్సిందే

Dawki River In Meghalaya Cleanest River In Asia: ఈ రోజుల్లో కాలుష్యం కానిది ఏదీ లేదు. గాలి, నీరు, భూమి.. అన్నీ కలుషితమే. స్వచ్చమైనది, పరిశుభ్రమైనది ఏదీ లేదు, ఎక్కడా కనిపించదు. స్వచ్చత, పరిశుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భూతద్దం పెట్టి వెతికినా.. పరిశుభ్రత కనిపించడం కష్టమే. అలాంటి ఈ రోజుల్లో పరిశుభ్రమైన నది ఉందంటే నమ్ముతారా? ఆ నదిలోని నీరు క్రిస్టల్ క్లియర్ గా ఉంటుందంటే విశ్వసిస్తారా? అదీ మన ఇండియాలోనే ఉందంటే బిలీవ్ చేస్తారా?

అవును.. పరిశుభ్రమైన నది.. ఒకటుంది.. దాని పేరు డాకి(Dawki). ఈ నది మన దేశంలోనే ఉంది. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని మావ్లినాంగ్ (Mawlynnong) గ్రామంలో ఉంది. మావ్లినాంగ్.. ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందింది. ఆ గ్రామంలో ఉన్న డాకి నది.. ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన నదిగా ప్రఖ్యాతి గాంచింది. డాకి నదిని ఉమ్ంగోట్ నది(Umngot River) అని కూడా పిలుస్తారు. జయంతియా, ఖాసి కొండలు మధ్య నుంచి ప్రవహిస్తుంది. చివరికి బంగ్లాదేశ్ లో కలుస్తుంది.


ఈ నది నీరు ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే.. నది లోపల ఉన్న ప్రతీది స్పష్టంగా కనిపిస్తుంది. నీళ్లలో ఉన్న రంగుల రాళ్లు, జలచరాలు అన్నీ క్లియర్ గా చూడొచ్చు. ఈ నదిలో బోట్ రైడ్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ ప్లేస్ కి వెళ్లే ప్రజలు, ఈ నది పరిశుభ్రతను చూసి విస్తుపోతారు. ఈ రోజుల్లోనూ ఇంత క్లియరెస్ట్ నది ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో గొప్ప అనుభూతిని పొందుతున్నారు.

దేవ భూమిగా పిలిచే మావ్లినాంగ్ గ్రామానికి 2003లో ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా అవార్డు దక్కింది. పరిశుభ్రమైన గ్రామమే కాదు.. వందశాతం అక్షరాస్యత రేటు సాధించిన గ్రామంగానూ గుర్తింపు పొందింది.

ఇక్కడ అన్ని ఇళ్లకు టాయ్ లెట్స్ ఉన్నాయి. గ్రామం మొత్తం వెదురుతో చేసిన డస్ట్ బిన్స్ ఉన్నాయి. ఎండిపోయి రాలిన చెట్ల ఆకులను కూడా చెత్తబుట్టలో వేస్తారు. ఈ గ్రామంలో ప్లాస్టిక్ బ్యాగులు పూర్తిగా నిషేధం. అంతేకాదు ధూమపానం(స్మోకింగ్) కూడా నిషేధమే.

ట్రెండింగ్ వార్తలు