Mysuru Library : కూలీ ‘లైబ్రరీ’ని తగలబెట్టిన దుండగులు.. 7 లక్షలకు పైగా విరాళం

కర్నాటకలోని మైసూరు సిటీలో ఓ పబ్లిక్ లైబ్రరీకి దుండగులు నిప్పుపెట్టారు. సయ్యద్‌ ఇసాక్‌ అనే 62ఏళ్ల వ్యక్తి గత కొన్నేళ్లుగా తన గుడిసెలో గ్రంథాలయాన్ని నడుపుతున్నాడు.

daily wage earner library  : కర్నాటకలోని మైసూరు సిటీలో ఓ పబ్లిక్ లైబ్రరీకి దుండగులు నిప్పుపెట్టారు. సయ్యద్‌ ఇసాక్‌ అనే 62ఏళ్ల వ్యక్తి గత కొన్నేళ్లుగా తన గుడిసెలో గ్రంథాలయాన్ని నడుపుతున్నాడు. రోజువారీ కూలి పనుల్లో వచ్చిన సొమ్ము మొత్తాన్ని కూడబెట్టుకుని మరి పుస్తకాలను కొనుగోలు చేశారు. అలా కొన్ని వేల పుస్తకాలను ఆయన గ్రంథాలయంలో సమకూర్చారు.

అయితే రెండు రోజుల క్రితం గుర్తుతెలియని దుండగులు గ్రంథాలయానికి నిప్పుపెట్టారు. దాదాపు 11 వేల పుస్తకాలు కాలి బూడిదయ్యాయి. ఈ గ్రంథాలయం పున:నిర్మాణం కోసం రూ.7 లక్షలకు పైగా విరాళంగా అందించారు.


46 రోజుల్లో రూ.10 లక్షలు సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అమ్మార్ మసీద్ సిటీకి సమీపంలోని రాజీవ్ నగర్ సెకండ్ స్టేజీలో సయ్యద్ ఇసాక్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. అక్కడి స్థానికులందరికి ఈ గ్రంథాలయంలో ఉచితంగా చదవుకునే వీలు కల్పించారు. దాదాపు 11వేల పుస్తకాల్లో భగవత్ గీతా, ఖురాన్, బైబుల్ సహా అనేక మహా గ్రంథాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు